
● మారుమూల పల్లె రోడ్లకు ఇబ్బందులు ● అటవీ అనుమతులు లేక జ
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: అటవీ సమీప గ్రామాలకు ఏళ్లుగా రహదారి కష్టాలు తీరడం లేదు. వర్షాకాలంలో రవాణాకు గ్రామీణ ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పంచాయతీ రాజ్, రోడ్లు భవనాల శాఖ పరిధిలో నిర్మిస్తున్న పలు పనులకు అనుమతుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. కొన్ని పనులకు మొదటి దశ అనుమతి వరకు, కొన్నింటికి రెండో దశలో ఉన్నాయి. ప్రభుత్వం, స్థానిక ప్రజాప్రతినిధుల చొరవతో రోడ్డు నిర్మాణాలకు మంజూరు వస్తున్నాయి. ఆ రోడ్డు నిర్మాణంలో భాగంగా అటవీ, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు, సున్నిత ప్రాంతాలు ఉన్నచోట్ల రాష్ట్ర స్థాయిలో కాకుండా కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ నుంచి అనుమతులు తీసుకోవాలి. జాతీయ రహదారులు, నాలుగు వరుసల దారులకు పల్లె రోడ్ల కంటే త్వరితగతిన అనుమతులు వచ్చాయి. మొదటి, రెండో దశ, అటవీ పరిహారం, వన్యప్రాణుల కోసం ప్రత్యేకంగా అండర్‌పాస్‌లు ఏర్పాటు చేయడంతో అనుమతులు వస్తున్నాయి. కానీ రాష్ట్ర పరిధి పంచాయతీ రాజ్, ఆర్‌అండ్‌బీ పనుల్లో మాత్రం అందుకు భిన్నంగా జాప్యం జరుగుతోంది.
ఏళ్లుగా అదే తీరు..
2017లో మంజూరైన రోడ్డు పనులు ఇప్పటికీ ప్రారంభం కావడం లేదు. అటవీ, వన్యప్రాణుల ప్రాంతాలు సున్నితమైన జోన్లుగా ఉన్న ప్రాంతాల్లో రోడ్డు నిర్మాణాలకు నిబంధనలు కఠినంగా ఉంటాయి. అటవీ సమీప ప్రాంతాల నుంచి రహదారుల నిర్మాణంతో అటవీ సంపదతోపాటు జీవజాతులకు ముప్పు కారణంగా అభ్యంతరాలు వస్తుంటాయి. దీంతో పంచాయతీరాజ్, రోడ్లు భవనాల శాఖ నుంచి జిల్లాలో అనేక మారుమూల ప్రాంతాల దారులకు మోక్షం కలుగడం లేదు. ఇప్పటికీ జాతీయ రహదారిగా ఉన్న ఎన్‌హెచ్–63కి సైతం అటవీ అనుమతుల్లో జాప్యం జరిగింది. జోడువాగు వద్ద వంతెన నిర్మాణం గత కొన్నేళ్లుగా ముందుకు సాగడం లేదు. ఇటీవల విస్తరణ కోసం కేంద్ర స్థాయిలో అనుమతులు రావడంతో త్వరలో పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. శ్రీరాంపూర్ బస్టాండ్ నుంచి జీఎం ఆఫీసు వరకు ఇందారం బీట్ పరిధిలో అటవీ అనుమతులు లేక రోడ్డు మధ్యలోనే నిలిచిపోయింది. నిత్యం ప్రమాదాలు జరిగే ఈ బ్లాక్ స్పాట్స్ వద్ద ప్రమాదం పొంచి ఉంది.

● మారుమూల పల్లె రోడ్లకు ఇబ్బందులు ● అటవీ అనుమతులు లేక జ

● మారుమూల పల్లె రోడ్లకు ఇబ్బందులు ● అటవీ అనుమతులు లేక జ