
ధాన్యం కొనుగోలు చేయాలని ధర్నా
చెన్నూర్‌రూరల్: గత మూడు రోజులుగా కొనుగోలు కేంద్రంలో ధాన్యం తూకం వేయడం లేదని, సన్నరకం ధాన్యంలో తరుగు చాలా తీస్తున్నారని మండలంలోని కిష్టంపేట గ్రామంలో రైతులు బుధవారం చెన్నూర్–మంచిర్యాల రహదారిపై ధర్నా చేపట్టారు. పోలీసులు అక్కడికి చేరుకుని ధర్నా విరమించాలని సూచించగా.. నిరాకరించారు. రైతుల ను అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకపోయింది. ఈ క్రమంలో పోలీసులు, రైతుల మధ్య వాగ్వాదం జరిగింది. చివరికి పో లీసులు నచ్చజెప్పి ధర్నా విరమింపజేశారు. అనంతరం రైతులు పోలీసులు, ఏడీఏ భానుప్రసాద్, ఏవో యామినిలను కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్లి కష్టాలను వివరించారు. ఉన్నతాధికారులతో మా ట్లాడి ధాన్యం కొనుగోలు చేపట్టేలా చూస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు.
కలెక్టరేట్ ఎదుట నిరసన
మంచిర్యాలఅగ్రికల్చర్: సన్న రకం ధాన్యాన్ని మిల్ల ర్లు దించుకోకుండా కొర్రీలు పెడుతున్నారని చె న్నూర్ మండలం కిష్టంపేట గ్రామ రైతులు బుధవా రం కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఆరబెట్టి, తాలు త ప్ప లేకుండా నిబంధనల మేరకు తరలించినా దించుకోవడం లేదని పేర్కొన్నారు. ధాన్యం నూకలు వ స్తున్నాయని, క్వింటాల్‌కు 16 నుంచి 20 కిలోల వ రకు ఎక్కువగా ఇస్తే దించుకుంటామని, లేదా బీ గ్రే డ్ కింద బస్తాకు 43 కిలోల చొప్పున దించుకుంటా మని, లేదంటే తీసుకెళ్లాలని కొర్రీలు పెడుతున్నారని రైతులు వాపోయారు. వర్షంతో ధాన్యం త డిసిపోతుందని, అధికారులు జోక్యం చేసుకుని నష్టపోకుండా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.