
రైల్వే పనులు పరిశీలించిన డీఆర్‌ఎం
బెల్లంపల్లి: బెల్లంపల్లి రైల్వేస్టేషన్ ఆవరణలో ప నులను దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివి జనల్ రైల్వే మేనేజర్(డీఆర్‌ఎం) భర్తేష్‌కుమార్‌జైన్ గురువారం పరిశీలించారు. ప్రత్యేక రైలు లో మహారాష్ట్రలోని బల్లార్షా రైల్వేస్టేషన్ నుంచి వచ్చిన ఆయన మంచిర్యాల, బెల్లంపల్లి, కాగజ్‌నగర్ రైల్వేస్టేషన్లను సందర్శించారు. రైల్వే అధికారులు పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. బెల్లంపల్లి రైల్వేస్టేషన్ పరిసరాల్లో ని ర్మాణ పనులను పర్యవేక్షించారు. గతంలో చేప ట్టి అసంపూర్తిగా ఉన్న పనులతోపాటు కొత్తగా మంజూరైన పనులు, గూడ్స్ రైళ్ల ట్రాక్ పనులు, నాణ్యత పరిశీలించారు. అధికారులు పనుల వివరాలు, పురోగతిని వివరించారు. నిర్ధేశించి న గడువు ప్రకారం పనులు పూర్తి చేయాలని డీ ఆర్‌ఎం ఆదేశించారు. పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని కిందిస్థాయి అధి కారులకు సూచించారు. రైల్వేస్టేషన్ ప్లాట్‌ఫా మ్‌లను సందర్శించారు. సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్(డీసీఎం) బాలాజీకిరణ్, తదితరులు పాల్గొన్నారు.