
ప్రతి ఒక్కరూ రైతు గుర్తింపు పొందాలి
● జిల్లా వ్యవసాయాధికారి కల్పన ● హాజీపూర్‌లో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు
మంచిర్యాలరూరల్(హాజీపూర్): కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఫార్మర్ ఐడీ కార్యక్రమం ద్వారా రైతులు ప్రతి ఒక్కరూ రైతు గుర్తింపు పొందాలని జిల్లా వ్యవసాయాధికారి కల్పన అన్నారు. బుధవారం హాజీపూర్ మండలం సబ్బేపల్లి జిల్లా పరిషత్ ఉన్న త పాఠశాలలో హాజీపూర్ రైతు ఉత్పత్తి సంఘం ఆధ్వర్యంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం నిర్వహించారు. జిల్లా వ్యవసాయాధికారి కల్పన మాట్లాడుతూ రసాయనిక ఎరువుల వాడ కం తగ్గించి సేంద్రియ సాగు చేసి భావితరాలకు మెరుగైన సాగు అందించాలని సూచించారు. బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కో ఆర్డినేటర్, శాస్త్రవేత్త డాక్టర్ కోట శివకృష్ణ మాట్లాడుతూ ప్రతీ రైతు సేంద్రియ సాగువైపు దృష్టి సారించాలని, నేలతల్లి ఆరోగ్యాన్ని కాపాడాలని, సాగునీటిని ఆదా చేయాలని అన్నారు. పంటల మార్పిడి చేయాలని, పర్యావరణ పరిరక్షణలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. జిల్లా ఉద్యానవన, పట్టుపరిశ్రమ అధికారులు రైతులకు సలహాలు, సూచనలు, సబ్సిడీలపై తెలియజేశారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ ఏడీఏ అనిత, నిజామాబాద్, ఆది లాబాద్ విత్తన ధ్రువీకరణ అధికారి సురేశ్‌కుమార్, ఎఫ్‌పీఓ డైరైక్టర్లు పూస్కూరి శ్రీనివాసరావు, శంకర్, అభ్యుదయ రైతులు లక్ష్మణ్, సత్తయ్య, కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ తిరుపతి, పంట ఉత్పాదక శాస్త్రవేత్త డాక్టర్ స్రవంతి, హాజీపూర్ మండల వ్యవసాయాధికారి కృష్ణ, ఉద్యానవన అధికారి సహజ, పట్టుపరిశ్రమ అధికారి సురేందర్, ఏఈఓ ప్రసన్న, ఉదయ్‌కుమార్, రైతులు పాల్గొన్నారు.