
గొలుసు చోరీ నిందితుల అరెస్ట్
నిర్మల్‌టౌన్: గొలుసు చోరీలకు పాల్పడిన ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంగళవా రం ఏఎస్పీ అవినాష్‌కుమార్ జిల్లా కేంద్రంలోని డీ ఎస్పీ కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. గత నెల 30న నిర్మల్ నుంచి నిర్మల్ రూరల్ మండలం వెంగ్వపేట్‌కు దంపతులు మోటార్ సైకిల్‌పై వెళ్తున్నారు. మార్గమధ్యలో కావేరి కుఠీర్ వద్ద ఇద్దరు గు ర్తుతెలియని వ్యక్తులు వారి మోటార్ సైకిల్‌ను అడ్డగించి బంగారు గొలుసు, పుస్తెల తాడు అపహరించి బైక్‌పై పరారయ్యారు. బాధితులు నిర్మల్ రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మంగళవారం స్థానిక మంజులాపూర్‌లోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఇద్దరు అ నుమానాస్పదంగా వచ్చి పోలీసులను చూసి పారి పోయే ప్రయత్నం చేశారు. వెంటనే పోలీసులు వారి ని పట్టుకున్నారు. నాందేడ్ జిల్లా సోనారి తాలూకా కు చెందిన బాలాజీ, రూరల్ మండలం తలవేద గ్రామానికి చెందిన అలిశెట్టి శ్రీనివాస్‌గా గుర్తించా రు. వారిని విచారించగా.. దంపతుల మెడల్లోంచి చైన్, పుస్తెలతాడు దొంగిలించినట్లు ఒప్పుకొన్నా రు. వారి నుంచి రెండు తులాల బంగారు పుస్తెలతా డు, తులం చైన్ స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని అ రెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కానిస్టేబుళ్లు సంతోష్, సత్యనారాయణను ఏఎస్పీ అభినందించారు. సీఐ కృష్ణ, ఎస్సై లింబాద్రి, సిబ్బంది ఉన్నారు.