
ఆహ్లాద వనం.. నిర్వహణ శూన్యం
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: నగరంలోని హౌసింగ్ బోర్డు కాలనీ, ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల మైదానంలో ఒక్కో ఓపెన్ జిమ్, వివిధ చోట్ల 22 పార్కులు నిర్మించిన మున్సిపల్ అధికారులు ఆ తర్వాత వాటి నిర్వహణను పట్టించుకోవడం లేదు. దీంతో వాకర్స్, ప్రజలు ఆహ్లాదకర వాతావరణానికి నోచుకోని పరిస్థితులు నెలకొన్నాయి. వీటి కోసం సుమారు పదేళ్ల క్రితం రూ.ఎనిమిది లక్షల నుంచి రూ.30 లక్షల వరకు వెచ్చించారు. అలాగే ఈ రెండేళ్ల కాలంలో మరమ్మతులకు, నిర్వహణ కోసం రూ.20 లక్షలు కేటాయించడం గమనార్హం. కాగా ‘సాక్షి’ బృందం గురువారం ఓపెన్ జిమ్‌లతో పాటు కొన్ని పార్కులను పరిశీలించగా నిర్వహణ లోపం కొట్టొచ్చినట్లు కనిపించింది.
● టీచర్స్‌కాలనీలోని చిన్నపిల్లల పార్కును 1,942 చ.మీ. విస్తీర్ణంలో 2016 ఏర్పాటు చేశారు. అనంతరం అధ్వాన స్థితికి చేరడంతో రెండేళ్ల నుంచి వృథాగా వదిలేశారు. ప్రస్తుతం దీనికి మరమ్మతు పనులు కొనసాగుతున్నాయి. వాకింగ్ ట్రాక్ పూర్తి కాగా మిగతా పరికరాలు ఏర్పాటు చేయాల్సి ఉంది.
జిల్లాకేంద్రంలో 2 ఓపెన్ జిమ్‌లు..22 పార్కులు
ఒక్కోదానికి రూ.8 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు వ్యయం
నిర్వహణ పట్టించుకోని మున్సిపల్ అధికారులు
ఆహ్లాదకర వాతావరణానికి నోచుకోని వాకర్స్, నగర ప్రజలు
శ్రీనివాసకాలనీలోని పార్కును 2021 జూలైలో రూ.1.42 కోట్లతో ప్రారంభించారు. ఇక్కడికి ప్రతిరోజూ దాదాపు 200 మంది కాలనీవాసులు వస్తుంటారు. చిన్నపిల్లలు ఆడుకునే వివిధ పరికరాలు బాగానే ఉన్నాయి. ప్రాంగణంలోని చుట్టూ వాకింగ్ ట్రాక్ సరిగా లేదు. ఎక్కడికక్కడ చిన్న కంకరతో ఉండగా చాలా వరకు వర్షపు నీళ్లు నిలుస్తున్నాయి. రెస్ట్ షెడ్‌లో ఫ్లోరింగ్ దెబ్బతిన్నది. పక్కనే పొదలు, చీదుతో నిండిపోగా.. రూరల్ పీస్ సీజ్ చేసిన వందలాది వాహనాలు ఉన్నాయి. అటువైపు వెళ్లాలంటే ప్రజలు జంకుతున్నారు.

ఆహ్లాద వనం.. నిర్వహణ శూన్యం

ఆహ్లాద వనం.. నిర్వహణ శూన్యం

ఆహ్లాద వనం.. నిర్వహణ శూన్యం

ఆహ్లాద వనం.. నిర్వహణ శూన్యం