
పుష్పాలతో అలంకరించిన సాక్షిగణపతి ఆలయం, విద్యుత్ దీపాల అలంకరణలో గణపతి
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో సోమవారం నుంచి నిర్వహించనున్న గణపతి నవరాత్రి మహోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉత్సవాల సమయంలో ఆలయ ప్రాంగణంలో రత్నగర్భ గణపతికి, శ్రీశైలం సమీపంలోని సాక్షి గణపతి స్వామికి, యాగశాలలోని పంచలోహమూర్తికి ప్రతి నిత్యం వ్రతకల్పం విశేషార్చనలు నిర్వహించడం జరుగుతుంది. ఆదే విధంగా సాక్షిగణపతి వద్ద మృత్తికా గణపతిని (మట్టి గణపతి) కూడా నెలకొల్పి ఉత్సవ సమయంలో ప్రతి రోజూ వ్రత కల్ప పూర్వకంగా పూజాధికాలను నిర్వహిస్తారు. ఇందులో భాగంగా సాక్షిగణపతి వద్ద విద్ద్యుదీకరణ, వివిధ రకాల పుష్పాలంకరణ ఏర్పాటు చేశారు. కాగా సోమవారం యాగశాలప్రవేశం, గణపతి హోమం నిర్వహించనున్నారు. ఉత్సవాల్లో భాగంగానే ఈనెల 19వ తేదీ నుంచి 27వ తేది వరకు ప్రతి రోజు పూజలు నిర్వహిస్తారు.
