
కృష్ణా జిల్లా కలెక్టర్‌కు రెడ్ క్రాస్ రాష్ట్ర అవార్
మచిలీపట్నంఅర్బన్: మానవీయ సేవల్లో అత్యుత్తమ కృషికి గుర్తింపుగా కృష్ణా జిల్లా కలెక్టర్, రెడ్ క్రాస్ జిల్లా శాఖ అధ్యక్షుడు డి.కె.బాలాజీ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్రస్థాయి అవార్డుకు ఎంపికయ్యారని జిల్లా కార్యదర్శి శంకర్‌నాథ్ భవిరి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. గతేడాది బుడమేరు, కృష్ణా నది వరదల్లో ప్రజలను ఆదుకోవడంలో కలెక్టర్ చూపిన నాయకత్వం, సేవా కార్యక్రమాల నిర్వహణకు గుర్తింపుగా ఈ అవార్డు వరించిందని పేర్కొన్నారు. వరదబాధితులకు ఆహారం, అవసరమైన సహాయాన్ని అందించడంతో పాటు, జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే పని కూడా చురుకుగా నిర్వహించారని వివరించారు. ప్రపంచ రెడ్ క్రాస్, తలసీమియా దినోత్సవాల సందర్భంగా ఈ నెల ఎనిమిదో తేదీన రాజ్ భవన్ దర్బార్‌లో నిర్వహించే కార్యక్రమంలో గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ఈ అవార్డు ప్రదానం చేస్తారని తెలిపారు.
దుర్గగుడి ఈఓగా శీనానాయక్
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఈఓగా శీనానాయక్‌ను నియమిస్తూ ప్రభుత్వం జీఓ జారీ చేసింది. బుధవారం సాయంత్రం ఆయన బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉందని సమాచారం. ‘భద్రతేది... భవానీ?’ శీర్షికన ‘సాక్షి’లో ఈ నెల రెండో తేదీన దుర్గగుడి భద్రతపై కథనం ప్రచురితమైంది. ఆలయంలో జరుగుతున్న మాస్టర్ ప్లాన్ పనులు, ఈఓ అందుబాటులో లేకపోవడం, అన్ని విభాగల్లో చోటు చేసుకుంటున్న వైఫల్యాలను ఈ కథనం వివరించింది. ఈ ఏడాది జనవరి ఒకటో తేదీ నుంచి దుర్గగుడి ఈఓగా ఉన్న రామచంద్ర మోహన్‌కు ఆ తర్వాత దేవదాయ శాఖ కమిషనర్‌గా, అదనపు కమిషనర్‌గా బాధ్యతలు అప్ప గించింది. రాష్ట్రంలో అతి పెద్ద దేవాలయాల్లో రెండో స్థానంలో ఉన్న దుర్గగుడికి శాశ్వత ఈఓ లేకపోవడం కూటమి పాలనకు నిదర్శనంగా నిలవడమే కాకుండా భక్తుల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ప్రభుత్వం దుర్గగుడి ఈఓగా శీనా నాయక్‌ను నియమించింది.
10న డయల్ యువర్ ఎస్పీ
కోనేరుసెంటర్(మచిలీపట్నం): ప్రజా సమ స్యల పరిష్కారం కోసం ఈ నెల పదో తేదీన డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్.గంగాధరరావు మంగళవారం తెలిపారు. ఆ రోజు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగే ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజలు తమ సమస్యలను స్వయంగా తన దృష్టికి తీసుకురావచ్చని సూచించారు. తన దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరించేందుకు సత్వరమే చర్యలు తీసుకుంటా నని పేర్కొన్నారు. జిల్లాలోని మారుమూల ప్రాంతాల నుంచి జిల్లా పోలీస్ కార్యాలయానికి రాలేని బాధితుల కోసం ఈ కార్యక్ర మాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు 94407 96400 నంబర్‌కు ఫోన్ చేసి తమ సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని ఎస్పీ సూచించారు.
దక్షిణ ఆసియా వైద్య సదస్సులో సిద్ధార్థ వైద్యుల ప్రతిభ
లబ్బీపేట(విజయవాడతూర్పు): మంగుళూరులో ఈ నెల రెండు నుంచి నాలుగో తేదీ వరకు జరిగిన 13వ దక్షిణ ఆసియా దేశాల చర్మ వ్యాధి వైద్యుల సదస్సులో విజయవాడ ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాల వైద్యులు ప్రతిభ చూపారు. ఆ సదస్సులో పాల్గొన్న చర్మవ్యాధుల విభాగాధిపతి డాక్టర్ టి.వాణి సమర్పించిన పరిశోధన పత్రానికి పోస్టర్ విభాగంలో అవార్డు లభించింది. ఆమె పర్యవేక్షణలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు పలు పరిశోధన పత్రాలు సమర్పించారు. స్కాలర్ షిప్ పోటీల్లో డాక్టర్ టి.వాణితో పాటు మరో నలుగురు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా వారిని మంగళవారం వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి.అశోక్‌కుమార్, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎ.వెంకటేశ్వరరావు అభినందించారు.
కలెక్టర్ బాలాజీ

కృష్ణా జిల్లా కలెక్టర్‌కు రెడ్ క్రాస్ రాష్ట్ర అవార్