
చిన్నారిని చిదిమేసిన కారు
పామర్రు: కారు ఢీకొని ఏడాదిన్నర చిన్నారి దుర్మరణం చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... డోకిపర్రుకు చెందిన ఉప్పలపాటి దుర్గారావు, హారిక దంపతులు తమ కుమార్తె హన్వికను ఒడిలో కూర్చు బెట్టుకుని బైక్‌పై పామర్రు నుంచి గుడివాడ జాతీయ రహదారిలో వస్తున్నారు. కొండాయపాలెం వద్దకు చేరుకోగానే అదే రహదారిలో మచిలీపట్నం నుంచి గుడివాడ వెళ్తున్న కారు బైక్‌ను ఓవర్ టేక్ చేస్తూ ఢీకొట్టింది. దీంతో బైక్‌పై నున్న వాళ్లు కింద పడిపోయారు. వారిని కారు కొంత దూరం ఈడ్చుకెళ్లింది. దుర్గారావు, హారికతో పాటు చిన్నారి హన్వికకు తీవ్ర గాయాలయ్యాయి. హాస్పటల్‌కు తీసుకెళ్తుండగా హన్విక మార్గ మధ్యలో మృతి చెందింది. దంపతులకు పామర్రులోని వైద్యశాలకు తీసుకెళ్లి ప్రాథమిక చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం మచిలీపట్నం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వీరి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఈ సంఘటనలో కారు అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న సిమెంట్ స్తంభాన్ని సైతం ఢీకొట్టింది. కారులో డ్రైవర్, ముగ్గురు మహిళలు, ఒక చిన్నారి ఉన్నారు. ఎస్‌ఐ రాజేంద్ర ప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.