
బనశంకరి: సిటీ మార్కెట్‌లో ఆంధ్రప్రదేశ్ కు చెందిన అక్షయ్ అనే వ్యక్తి వద్ద ఎలాంటి ఆధారాలు లేని రూ.28 లక్షల నగదు, రూ.20 లక్షల విలువచేసే 319 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.10 లక్షల విలువచేసే 15 కిలోల వెండిని సీటీమార్కెట్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం రాత్రి సిటీ మార్కెట్‌లో అనుమానాస్పదంగా బ్యాగు పట్టుకుని తిరుగుతున్న ఆ వ్యక్తిని పోలీసులు అడ్డుకుని తనిఖీ చేశారు.
బ్యాగులో నగదు, బంగారు, వెండి ఆభరణాలు లభించగా స్వాధీనం చేసుకున్నారు. అతన్ని ప్రశ్నించగా, ఒక జ్యువెలరి షాప్‌కు ఇవ్వడానికి వచ్చానని తెలిపారు. అయితే నగదు, నగలకు ఎలాంటి రికార్డులు అతని వద్ద లభించలేదు. ఐటీ శాఖ అధికారులకు పోలీసులు సమాచారం అందించగా, వారు అక్షయ్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.