దళారులను ఆశ్రయించొద్దు
కామారెడ్డి క్రైం: డ్రైవింగ్ లైసెన్స్‌లు, వాహనాలకు సంబంధించిన అన్ని రకాల పత్రాల కోసం దళారులను ఆశ్రయించొద్దని రవాణా శాఖ జిల్లా అధికా రి శ్రీనివాస్‌రెడ్డి సూ చించారు. మంగగళవారం ఆయన ‘సాక్షి’ తో మాట్లాడారు. ఏ అవసరం ఉన్నా మీ సేవ, ఇంటర్నెట్ సెంటర్‌ల ద్వారా ఆన్‌లైన్‌లో స్లాట్ బుక్ చేసుకుని నేరుగా కార్యాలయానికి వచ్చి అధికారులను సంప్రదించాలన్నారు. రవాణా శాఖ కార్యాలయంలో పారదర్శకంగా సేవలు అందిస్తున్నామని తెలిపారు. ఎలాంటి అపోహలకు తావు లేదని స్పష్టం చేశారు. ఇటీవల ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన ‘సారథి’ అనే వెబ్‌సైట్‌లో స్లాట్ బుకింగ్ చేసేందకు ఎక్కువ సమయం తీసుకుంటోందని, అదొక్క టి మాత్రమే వాహనదారులకు ఇబ్బందికరంగా ఉందన్నారు. అందులో రెన్యువల్స్‌కు ఎదురవుతున్న సాంకేతిక సమస్యలను పరిష్కరించి స్లాట్ బుకింగ్ త్వరగా అయ్యేలా చూడాలని ఇదివరకే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లామని పేర్కొన్నారు. ఏవైనా సమస్యలు ఉంటే నేరుగా తనను సంప్రదించాలని, ప్రతి రోజూ ఉదయం 11 నుంచి సాయంత్రం 3 గగంటల వరకు అందుబాటులో ఉంటానని తెలిపారు.


