పిఠాపురం: ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణకు ఐక్య ఉద్యమాలు చేయాలని భారత విద్యార్థి సమాఖ్య (ఎస్‌ఎఫ్‌ఐ) రాష్ట్ర అధ్యక్షుడు పి.రామ్మోహన్ విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఎస్‌ఎఫ్‌ఐ 30వ మహాసభల ముగింపు సందర్భంగా రెండో రోజైన ఆదివారం స్థానిక రథాలపేటలోని అంబేడ్కర్ మల్టీపర్పస్ కమ్యూనిటీ హాలులో ప్రతినిధుల సభ నిర్వహించారు. తొలుత ఎస్‌ఎఫ్‌ఐ మండల అధ్యక్షురాలు జి.చిన్ని స్వాతంత్య్రం, ప్రజాస్వామ్యం, సోషలిజం ఆశయాలతో కూడిన జెండా ఎగురవేశారు. స్వాతంత్ర సమర యోధులు భగత్‌సింగ్, అల్లూరి సీతారామరాజు, రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ చిత్రటాలకు రామ్మోహన్, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా గర్ల్స్ కమిటీ కన్వీనర్ చిన్ని, జిల్లా కార్యదర్శి గంగా సూరిబాబు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జిల్లా నలుమూలల నుంచీ వచ్చిన ప్రతినిధులతో నిర్వహించిన మహాసభలో రామ్మోహన్ మాట్లాడుతూ, ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణకు ఎస్‌ఎఫ్‌ఐ 55 సంవత్సరాలుగా నిరాటంకంగా పోరాడుతోందని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేగంగా అమలు చేస్తున్న విద్యా వ్యతిరేక విధానాలపై విద్యార్థులు పోరాడాలని పిలుపునిచ్చారు. పీజీ విద్యార్థులకు గుదిబండగా ఉన్న జీఓ 77ను తక్షణమే రద్దు చేయాలని, రూ.6,400 కోట్ల ఫీజ్ రీయింబర్స్‌మెంట్ బకాయిలు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలోని 9 ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో కనీస సౌకర్యాలు లేవని అన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోని పిఠాపురం, గొల్లప్రోలుల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు నూతన భవనాలు తక్షణం నిర్మించాలని, యు.కొత్తపల్లి మండలంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గంలో పీజీ కళాశాల లేక విద్యార్థులు దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందన్నారు. అందువలన డిప్యూటీ సీఎం తక్షణమే స్పందించి నియోజకవర్గంలో ప్రభుత్వ పీజీ కళాశాల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని కోరారు. ప్రభుత్వ పాఠశాల, కళాశాలల సమయానికి అనుగుణంగా విద్యార్థుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపాలని విజ్ఞప్తి చేశారు. ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు జి.శ్రీకాంత్, సీహెచ్ సాహిత్, అమృత, లోవరాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా పలువురు నాయకులు పాల్గొన్నారు.
సమావేశంలో మాట్లాడుతున్న రామ్మోహన్
పతాకావిష్కరణ చేస్తున్న నాయకులు
0000669853-000001-VJA ADSALES SPO
10.00x8.00
VJA ADSALES SPOT PAYMENT ACCOUNT
ఫ ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు రామ్మోహన్
ఫ ముగిసిన జిల్లా మహాసభలు
ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణకు ఐక్య ఉద్యమాలు


