‘జల’సౌందర్యం
అసలే గిలిగింతలు పెడుతున్న చలికాలం.. ఆపై నీలాల నింగిని ఆవరించిన మేఘమాలికలు.. అది చాలదా అన్నట్లు నేలమ్మపై అపార జలరాశి.. గాలి తరగలకు సుతారంగా కదులుతున్న చిన్నిచిన్ని అలలు.. ఈ అద్భుత ప్రకృతి సౌందర్యాన్ని వీక్షించడానికి రెండు కన్నులూ చాలవేమోననే అనుభూతికి లోనయ్యారు.. ఏలేరు జలాశయాన్ని ఆదివారం సందర్శించిన వారు. ప్రస్తుతం రిజర్వాయర్‌లోకి ఎగువ నుంచి 859 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. దీని పూర్తి స్థాయి నీటిమట్టం 86.56 మీటర్లు కాగా, ఆదివారం 85.67 మీటర్లుగా నమోదైంది. పూర్తి సామర్థ్యం 24.11 టీఎంసీలకు గాను 22.30 టీఎంసీల మేర నీటి నిల్వలున్నాయి. ఆయకట్టుకు, తిమ్మరాజు చెరువుకు నీటి సరఫరాను నిలిపివేశారు. విశాఖకు 175 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.
– ఏలేశ్వరం


