
మెరుగైన వైద్య సేవలు అందించాలి
గద్వాల క్రైం: రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాల్సిన బాధ్యత వైద్యులపై ఉందని ఆరోగ్య శ్రీ సీఈఓ ఉదయ్‌కుమార్ సూచించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలను ఆయన సందర్శించి మాట్లాడారు. ప్రజల ఆరోగ్యాన్ని ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. జిల్లా వైద్య సంస్థలు రాష్ట్రంలో ఆదర్శంగా నిలవాలన్నారు. ఎన్‌ఎంసీ మెడికల్ కళాశాలను ఆన్‌లైన్ విధానంలో పరిశీలించి సూచనలు, సలహాలు ఇచ్చే ప్రక్రియను ప్రభుత్వం తీసుకోరావడం జరిగిందన్నారు. మెడికల్ కళాశాలలో వసతులు, సౌకర్యాలు, నిర్వహణ తదితర అంశాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఆసుపత్రిల్లో అన్ని వసతులు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. ఆరోగ్యశ్రీ పరంగా రోగులకు అన్ని రకాల వైద్య సేవలను ప్రభుత్వం అందిస్తోందని, దీనికి తమ వంత సహకారం అందజేస్తానని తెలిపారు. అనంతరం కళాశాల విద్యార్ధులతో ఆయన మాట్లాడారు. ఆరోగ్య శ్రీ సేవల అంశాలను జిల్లా అసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న నాగరాజు, అశోక్, వెంకటేష్, ప్రభాకర్‌లను పలు అంశాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో కలెక్టర్ బీఎం సంతోష్, ప్రిన్సిపల్ నాగశేఖర్, రమాదేవి, అసుపత్రి సూపరింటెండెంట్ ఇందిరా తదితరులు ఉన్నారు.