విపత్తులు ఎదుర్కొనేలా ముందస్తు చర్యలు | - | Sakshi
Sakshi News home page

విపత్తులు ఎదుర్కొనేలా ముందస్తు చర్యలు

Jul 2 2025 5:45 AM | Updated on Jul 2 2025 5:45 AM

 విపత్తులు ఎదుర్కొనేలా ముందస్తు చర్యలు

విపత్తులు ఎదుర్కొనేలా ముందస్తు చర్యలు

గద్వాల: జిల్లాలో ప్రకృతి విపత్తులు సంభవించినపుడు వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని శాఖలు సమన్వయంతో ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ బీఎం సంతోష్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఐడీవోసీ కార్యాలయంలో ఎస్పీ శ్రీనివాస్‌రావుతో కలిసి సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ విపత్తులు సంభవించినప్పుడు ఇబ్బందులు ఎదుర్కొనే కంటే వాటిని ముందస్తు కట్టడి చర్యలు తీసుకుంటే నష్టనివారణ చేయవచ్చన్నారు. జిల్లాలో రెండునదులైన కృష్ణా, తుంగభద్ర నదులు పారుతున్నాయని 2009లో భారీ వరద వచ్చిన సమయంలో అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకున్నారని గుర్తుచేశారు. ఈసారి జిల్లాలో మే నెల నుంచే వర్షాలు కురుస్తున్నందున అధిక వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. విపత్తులు రాకముందే ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. జిల్లా, మండల, గ్రామ స్థాయిలలో కమిటీలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. విపత్తుల నివారణ జిల్లా నోడల్‌ అధికారిగా అదనపు కలెక్టర్‌(రెవెన్యూ) నియమించినట్లు తెలిపారు. తహసీల్దార్లు మండల స్థాయిలలో సమావేశాలు నిర్వహించిన అవసరమైన నివారణ చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం ఎస్పీ శ్రీనివాస్‌రావు మాట్లాడుతూ భారీవర్షాల వల్ల శిథిలావస్థలో ఉన్న గృహాలు కూలిపోయే అవకాశమున్నందున అందుకనుగుణంగా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రెవెన్యూ,పోలీసు, ఇరిగేషన్‌, ఫైర్‌, ఎలక్ట్రిసిటీ అధికారులు 24గంటల పాటు అప్రమత్తంగా ఉండాలన్నారు. అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగ్‌రావు పాల్గొన్నారు.

ఉత్తమ ర్యాంకు సాధించడం అభినందనీయం

నీతిఆయోగ్‌ ర్యాంకింగ్‌లో దేశవ్యాప్తంగా టాప్‌–5లో స్థానం దక్కించుకున్న గట్టు బ్లాక్‌లో కృషి చేసిన అధికారులు అభినందనీయమని, భవిష్యత్తులో అగ్రస్థానమే లక్ష్యంగా ముందుకు సాగాలని కలెక్టర్‌ బీఎం సంతోష్‌ అన్నారు. ఐడీవోసీ కార్యాలయంలో ఈమేరకు అధికారులతో సమీక్షించారు. నీతిఆయోగ్‌ విడుదల చేసిన 2024–25క్యూ4 డెల్టా ర్యాంకింగ్‌లో గట్టు బ్లాక్‌ దేశంలో 5వ స్థానం, జోన్‌–3 స్థాయిలో 2వ స్థానాన్ని సాధించినట్లు తెలిపారు. ఈ విజయానికి గుర్తింపుగా గట్టు బ్లాకు నీతిఆయోగ్‌ నుంచి రూ.1కోటి పురస్కారం దక్కిందన్నారు. ఈవిజయంలో భాగస్వాములైన అధికారులు, విభాగధిపతులు, ఫ్రంట్‌లైన్‌ సిబ్బందని ప్రత్యేకంగా అభినందించారు. అదేవిధంగా ఆరోగ్యశాఖకు సహకరిస్తున్న ఎస్‌బీఐ సంజీవని, భవిష్యభారత్‌, టీచ్‌ఫోర్‌ చేంచ్‌, ఎంవీ ఫౌండేషన్‌ వారిని అభినందించారు. అదనపు కలెక్టర్‌ నర్సింగ్‌రావు, డీపీఓ నాగేంద్రం, డీఎంహెచ్‌వో సిద్దప్ప తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement