రొట్టెల తయారీతో జీవనోపాధి | - | Sakshi
Sakshi News home page

రొట్టెల తయారీతో జీవనోపాధి

Jul 3 2025 5:33 AM | Updated on Jul 3 2025 5:33 AM

రొట్ట

రొట్టెల తయారీతో జీవనోపాధి

అయిజ: జొన్నరొట్టెల తయారీ కుటీర పరిశ్రమగా మారింది. పేదల ఆర్థిక స్వావలంబనకు మార్గం చూపుతోంది. తక్కువ పెట్టుబడితో లాభదాయక వ్యాపారంగా ఉండటంతో చిరు వ్యాపారులు రొట్టెల తయారీని స్వయం ఉపాధిగా మలుచుకుంటున్నారు. చిన్నపాటి యంత్రాలతో కుటీర పరిశ్రమ ఏర్పాటు చేసుకొని ఆర్థికంగా రాణిస్తున్నారు. ఇంతకాలం కర్ణాటక రాష్టంలో మహిళలు తయారుచేసే జొన్న రొట్టెలను చిరు వ్యాపారులు జిల్లాలోని వివిధ గ్రామాలు, పట్టణాలకు సరఫరా చేసేవారు. ఈ నేపథ్యంలోనే రొట్టెల తయారీకి వినియోగించే యంత్రాలపై అవగాహన పెంపొందించుకున్నారు. మొదటగా అయిజ పట్టణంలో ఆరు నెలల క్రితం ఓ కుటుంబం సోలార్‌ సహాయంతో రొట్టెలు తయారుచేసే పరికరాన్ని రూ. 6లక్షలకు కొనుగోలు చేశారు. నాటి నుంచి నాణ్యమైన జొన్నరొట్టెలను తయారు చేసి వివిధ ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు. ప్రస్తుతం మల్దకల్‌ మండలంలోని నాగర్‌దొడ్డి, గట్టు మండలంలోని అరగిద్ద గ్రామాల్లో కుటీర పరిశ్రమలను ఏర్పాటు చేసుకొని జొన్నరొట్టెలను తయారు చేస్తున్నారు.

పెరిగిన ఆదరణ..

అల్పాహారం, భోజనం విషయంలో జొన్నరొట్టె రారాజుగా పేరుగాంచడంతో గిరాకీ పెరిగింది. నేటి తరం మహిళలకు జొన్నరొట్టెలు తయారు చేయడం రాకపోవడం.. తయారు చేయడం తెలిసిన వారు కూడా సమయం కేటాయించకపోవడం వల్ల అధిక శాతం బయట విక్రయించే రొట్టెలపైనే ఆధారపడుతున్నారు. ఈ నేపథ్యంలో చిరు వ్యాపారులు తక్కువ పెట్టబడితో కుటీర పరిశ్రమలను స్థాపించి జొన్నరొట్టెలను తయారీకి శ్రీకారం చుట్టారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పేదలు స్వ యం ఉపాధిగా మలుచుకుంటున్నారు. తయారు చేసిన జొన్న రొట్టెలను హోటళ్లు, దాబాలు, కిరాణ షాపుల్లో విక్రయించి ఆర్థికంగా రాణిస్తున్నారు.

గతంలో మేసీ్త్ర పనిచేసేటోళ్లం.

ఇంతకాలం మేసీ్త్రగా పనిచేసి కుటుంబాన్ని పోషించుకునే వాడిని. ఒక్కోసారి ఆర్థికంగా ఇబ్బందులు ఎదురయ్యేవి. ఇంటిల్లిపాది ఇంట్లోనే పనిచేసి సంపాదించుకునేందుకు రొట్టెల తయారీ మంచి మార్గమని తెలుసుకొని ఆరు నెలల క్రితం వ్యాపారం ప్రారంభించాను. హోటళ్లు, దాబాలు కిరాణం షాపులకు రొట్టెలను సరఫరా చేస్తున్నాను. శ్రమకు తగిన ఫలితం వస్తుంది. – గోపాల్‌, అయిజ

ఇంట్లోనే

పనిచేసుకుంటున్నాం..

గతలో రోజు కూలీకి వెళ్లే వాళ్లం. రొట్టెల తయారీలో నాకు మంచి ప్రావీణ్యం ఉంది. జొన్నరొట్టెలకు మార్కెట్‌లో ఉన్న డిమాండ్‌ చూసి మేమే రొట్టెలు తయారు చేసి మార్కెట్‌ చేయాలనే ఆలోచన వచ్చింది. ఇంట్లోనే కుటీర పరిశ్రమ పెట్టుకుని రొట్టెలు తయారు చేస్తున్నాం. – మంజుల, అయిజ

పల్లెల్లో కుటీర పరిశ్రమల స్థాపన

తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు

ఆర్థికంగా రాణిస్తున్న పేద కుటుంబాలు

రొట్టెల తయారీతో జీవనోపాధి 1
1/3

రొట్టెల తయారీతో జీవనోపాధి

రొట్టెల తయారీతో జీవనోపాధి 2
2/3

రొట్టెల తయారీతో జీవనోపాధి

రొట్టెల తయారీతో జీవనోపాధి 3
3/3

రొట్టెల తయారీతో జీవనోపాధి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement