
గురుకుల సీట్ల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
ఎర్రవల్లి: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని బీచుపల్లి బాలానగర్ బాలుర గురుకుల పాఠశాలలో 6 నుంచి 8 తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీ నిమిత్తం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఉమ్మడి జిల్లా కన్వీనర్ శ్రీనివాస్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన విదార్థులు ఆయా గురుకులాల్లో ఈ నెల 7వ తేదీలోగా స్వయంగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 9న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు బాలానగర్ గురుకుల పాఠశాలలో అర్హత పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థుల మెరిట్ ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుందన్నారు. మరిన్ని వివరాలకు 81069 63904, 99511 49909 నంబర్లను సంప్రదించాలని సూచించారు.
అర్హులందరికీ
ఇందిరమ్మ ఇళ్లు
గద్వాల: నియోజకవర్గంలో అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు వస్తాయని.. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గద్వాల మండలానికి చెందిన 303 మంది లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందజేశారు. కార్యక్రమంలో నాయకులు గడ్డం కృష్ణారెడ్డి, బండారి భాస్కర్, ప్రభాకర్‌రెడ్డి, రాజారెడ్డి, తిమ్మారెడ్డి, రాజశేఖర్, అశోక్, రంగన్న, వెంకట్రాములు, ప్రతాప్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
నేడు పీయూకు
విద్యా కమిషన్ రాక
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీకి గురువారం రాష్ట్ర విద్యా కమిషన్ రానుందని పీయూ రిజిస్ట్రార్ రమేష్‌బాబు పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం పీయూలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కమిషన్ ఏర్పడిన తర్వాత పాలమూరు యూనివర్సిటీలో మొట్టమొదటిసారిగా ‘విద్యా బలోపేతంపై అభిప్రాయ సేకరణ’ అనే అంశంపై నిర్వహించే కార్యక్రమానికి విద్యా కమిషన్ చైర్‌పర్సన్ ఆకునూరి మురళి, కమిషన్ మెంబర్స్ పీఎల్ విశ్వేశ్వర్‌రావు, చారకొండ వెంకటేష్, జ్యోష్నశివారెడ్డి, పీయూ వీసీ శ్రీనివాస్ పాల్గొంటారన్నారు. ఇందుకు సంబంధించి పీయూ పూర్వ, ప్రస్తుత విద్యార్థులు, అధ్యాపకులు, నాన్‌టీచింగ్ సిబ్బంది, విద్యార్థి సంఘాల నుంచి అభిప్రాయాలు సేకరిస్తారని తెలిపారు. సమావేశంలో ప్రిన్సిపాళ్లు కరుణాకర్‌రెడ్డి, రవికాంత్, రవికుమార్ ఉన్నారు.