ఆశ్రమ పాఠశాలల్లో మెనూ పాటించాలి
ఎస్‌ఎస్‌తాడ్వాయి: గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో మెనూ తప్పనిసరిగా పాటించాలని ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా ఆదేశించారు. మండల పరిధిలోని ఊరట్టం గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల, గోవిందరావుపేట మండలంలోని ప్రాజెక్ట్‌నగర్, కర్లపల్లిలో ని ఆశ్రమ పాఠశాలలను పీఓ బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలల్లోని టాయిలె ట్లు, నీటి సరఫరా, ఆర్‌ఓ వాటర్ ప్లాంట్లు, ఫ్యాన్లు, డ్రైయినేజీ, నీటి ఎద్దడి సమస్యలపై వార్డెన్లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పీఓ మాట్లాడుతూ తుపాను కారణంగా గిరిజన సంక్షేమశాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. విద్యార్థులు వి ద్యుత్ స్తంభాలకు తగలకుండా చూడాలని సూచించారు. అనుమతి లేకుండా విద్యార్థులు బయటకు వెళ్లొద్దని వెల్లడించారు. విద్యార్థుల ఆరోగ్య సమస్యలపై వైద్యాధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఏఎన్‌ఎంలు 24 గంటలు అందుబా టులో ఉండాలని ఆదేశించారు. మార్గదర్శకాల ప్ర కారం విద్యార్థులకు ఖచ్చితంగా మెనూను పాటించాలని పీఓ అధికారులకు తెలిపారు.
ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా


