చోరీకి పాల్పడ్డ ఇద్దరి అరెస్టు
గణపురం: మండలంలోని నగరంపల్లి గ్రామానికి చెందిన తండ్రి, కుమార్తె గుర్రం శ్రీనివాస్, గుర్రం సౌజన్య దొంగలించిన బంగారాన్ని విక్రయించడానికి వెళ్తుండగా అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు గణపురం ఎస్‌ఐ అశోక్ తెలిపారు. ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం.. నగరంపల్లి గ్రామానికి చెందిన ఆకుల కట్టయ్య ఇంట్లో ఈఏడాది జూన్‌లో చోరి జరిగిందని గణపురం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో గుర్రం సౌజన్య, గుర్రం శ్రీనివాస్‌లు 1.9 గ్రాములు బంగారు ఉంగరం, 6 గ్రాముల బంగారు కమ్మలు విక్రయించడానికి పరకాలకు తీసుకెళ్తుండగా నగరంపల్లి క్రాస్ వద్ద అనుమానం వచ్చి విచారించగా తాము తమ బంధువైన కట్టయ్య ఇంట్లో చోరీ చేసినట్లు అంగీకరించారు. గతంలో పరకాలలో శ్రావణ్ జ్యూవలరీ షాప్ ఓనర్ శ్రావణ్‌కు 2.1 తులాల నెక్లెస్ విక్రయించినట్లు తెలిపారు. ఈక్రమంలో మిగతా సొమ్మును విక్రయించడానికి వెళ్తున్నట్లు తేలడంతో వారి వద్ద ఉన్న బంగారం స్వాధీనం చేసుకొని వీరితోపాటు దొంగిలించిన బంగారాన్ని కొనుగోలు చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెల్లడించారు.


