గైర్హాజరుపై సీరియస్
జీఎం స్థాయి అధికారి
నెలవారీ సమీక్ష
భూపాలపల్లి ఏరియాలో వివరాలు
భూపాలపల్లి అర్బన్: ఉద్యోగుల గైర్హాజరుపై సింగరేణి యాజమాన్యం సీరియస్‌గా ఉంది. ఏడాదిలో 150 మస్టర్ల కన్నా తక్కువ ఉంటే విచారణ ఎదుర్కొనేలా నిబంధనలు రూపొందించింది. ఈమేరకు ఇటీవల ఉత్తర్వులు జారీచేసింది. కొత్త నిబంధనల ప్రకారం... మొత్తం ఉద్యోగుల్లో సుమారు 25శాతం వరకు గైర్హాజరు అవుతున్నారని గుర్తించింది. ఇది సంస్థకు ఇబ్బందికరమని భావిస్తోంది. దీనిప్రభావం బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకతపై పడుతోందని చెబుతోంది. గడిచిన మూడేళ్లతో పోల్చితే ఈ ఏడాది గైర్హాజరు శాతం పెరిగిందని ఆందోళన వ్యక్తం చే స్తోంది. దీర్ఘకాలికంగా విధులకు రాని ఉద్యోగులకు ఉచిత విద్యుత్, నీరు, వైద్యసౌకర్యాలు అందిస్తున్నా కంపెనీకి వారి సహకారం ఉండడం లేదంటోంది.
వచ్చేనెల 5వ తేదీన గుర్తింపు..
భూగర్భగనుల్లో పనిచేసే ఉద్యోగులు ప్రతీనెల 16 కన్నా తక్కువ, ఉపరితల ఉద్యోగులు 20 మస్టర్ల కన్నా తక్కువ చేస్తే వచ్చేనెల ఐదో తేదీన గుర్తించాలని సింగరేణి ఆదేశాలు జారీచేసింది. భూగర్భగనుల్లో మూడు నెలల పాటు ఇలాగే హాజరు ఉంటే గని మేనేజర్ స్థాయి అధికారి, మూడునెలల తర్వాత ఏరియాస్థాయి కమిటీకి పంపించాలని ఉత్తర్వులు జారీఅయ్యాయి. గైర్హాజరై కౌన్సెలింగ్‌కు హాజరు కాకుంటే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీచేసింది. ఒక క్యాలెండర్ సంవత్సరంలో 190/240 కన్నా తక్కువ మస్టర్లు ఉన్న ఉద్యోగుల విచారణ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించింది.
150 మస్టర్లు లేకుంటే గైర్హాజరే..
ఏడాదిలో నిర్ణీత 150 మస్టర్లు లేకుంటే గైర్హాజరు కార్మికుడిగా గుర్తిస్తారు. గతంలో వంద మస్టర్లు ఉండగా ప్రస్తుతం దానిని 150 మస్టర్లకు పెంచింది. 150కన్నా తక్కువ మస్టర్లు ఉన్న కార్మికుల పేర్లను ఆయా గనుల నోటీసు బోర్డులపై ప్రదర్శించాలని ఆదేశించింది. వచ్చే ఏడాది జనవరి 31నాటికి చార్జిషీట్, ఫిబ్రవరి–15లోగా కార్మికుల వివరణ, వివరణ సంతృప్తిగా లేకుంటే మార్చి 15 నాటికి విచారణ పూర్తిచేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. కౌన్సెలింగ్ నిర్వహించి ఏప్రిల్ 30 నాటికి కౌన్సెలింగ్ పూర్తి చేయనున్నట్లు సింగరేణి ప్రకటించింది.
గైర్హాజరు సమస్య సింగరేణి అభివృద్ధికి విఘాతంగా మారింది. ఈ విషయంలో ఉద్యోగులు ఆలోచించాలి. ఏడాదిలో కనీసం 150మస్టర్లు పూర్తిచేయకుంటే విచారణ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ ఆదేశాలను అన్ని ఏరియాల్లో కఠినంగా అమలు చేయాలని ఆదేశించాం.
– ఏనుగు రాజేశ్వర్‌రెడ్డి,
ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్
గైర్హాజరు విచారణ ఎదుర్కొనే కార్మికులపై చర్యల గురించి ప్రతీనెల నిర్వహించే సమీక్షలో ఏరియా స్థాయి జీఎంలు పర్యవేక్షించాలని యాజమాన్యం సూచించింది. గైర్హాజరు తగ్గించడానికి తగిన చర్యలు తీసుకోవాలని జీఎంలకు అధికారాలు కట్టబెట్టింది. ఈ విషయంలో ఏరియాల స్థాయిలో ప్రత్యేక మార్గదర్శకాలను రూపొందించవద్దని ఆదేశించింది.
సింగరేణిలో ఉత్పత్తి, ఉత్పాదకతపై ప్రభావం
ఏడాదిలో 150 మస్టర్లు ఉండాలి
లేదంటే ఉద్యోగానికి భద్రత ఉండదు
ఉత్తర్వులు జారీచేసిన సింగరేణి
తక్కువ మస్టర్లు నమోదైతే కౌన్సిలింగ్
అయినా మారకుంటే కఠిన చర్యలు
మొత్తం కార్మికులు 5,300
100 మస్టర్ల లోపు గైర్హాజరు 1,200మంది
150 మస్టర్ల లోపు గైర్హాజరు 2,000మంది
గైర్హాజరుపై సీరియస్
గైర్హాజరుపై సీరియస్


