దరఖాస్తుల స్వీకరణ
భూపాలపల్లి అర్బన్: జిల్లా స్థాయి యువజనోత్సవాల పోటీలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఇన్‌చార్జ్ డీవైఎస్‌ఓ రఘు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు 29వ జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా సాంస్కృతిక, సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇన్నోవేషన్ అంశాలపై పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జానపద నృత్యం, పాట, సైన్స్ మేళా, లైఫ్ స్కిల్స్ కాంపోనెంట్, కథా రచన, కవిత్వం, ప్రకటన, పెయింటింగ్ పోటీలు నిర్వహించనున్నట్లు చెప్పారు. 15నుంచి 19 సంవత్సరాలలోపు యువకులు, కళాకారులు దరఖాస్తులను డీవైఎస్‌ఓ కార్యాలయంలో అందించాలని సూచించారు. వివరాలకు 96180 11096, 81251 13132 ఫోన్ నంబర్లలో సంపద్రించాలన్నారు.
టేకుమట్ల: బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు పొన్నం భిక్షపతి అన్నారు. నవంబర్ 1న చలో హైదరాబాద్ వాల్‌పోస్టర్‌ను సోమవారం మండలకేంద్రంలోని బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద ఆవిష్కరించారు. అనంతరం భిక్షపతి మాట్లాడుతూ తెలంగాణలో బీసీల హక్కులను సాధించుకునే వరకు అందరం కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఈసీ సభ్యుడు సంగి రవి, జిల్లా ఇన్‌చార్జ్ బచ్చల రామస్వామి, జిల్లా ఉపాధ్యక్షుడు మేకల ఓంకార్, తాళ్లపల్లె రమేష్‌గౌడ్, పుల్యాల భగత్, జీడి రాజకొంరయ్య, పాల్గొన్నారు.
కాటారం: పశు పోషకులు తప్పనిసరిగా తమ పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకా లు వేయించాలని జిల్లా పశువైద్యాధికారి డాక్ట ర్ కుమారస్వామి అన్నారు. కాటారం మండలం కొత్తపల్లి, వీరాపూర్ గ్రామాల్లో పశువైద్య శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న టీకాల కార్యక్రమాన్ని పరిశీలించారు. ప్రతి గ్రామానికి వెళ్లి పశువులకు టీకాలు వేయాలని మండల పశువైద్యాధికారులను, సిబ్బందిని ఆదేశించా రు. ఈ కార్యక్రమంలో మండల పశువైద్యాధికారి డాక్టర్ రమేశ్, డాక్టర్ ధీరజ్, సహాయకులు తుంగల రాజశేఖర్, కిషన్, గోపాలమిత్ర శ్రీనివాస్, పశుమిత్ర నజీమా పాల్గొన్నారు.
భూపాలపల్లి రూరల్: అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం 2025–26 విద్యా సంవత్సరానికి విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించుటకు జిల్లాలోని షెడ్యూల్డ్ కులాల విద్యార్థిని, విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు షెడ్యూల్డ్ కులముల అభివృద్ధి అధికారి వెంకటేశ్వర్లు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అమెరికా, యునైటెడ్ కింగ్ డమ్, కెనడా, సింగపూర్, జర్మనీ, న్యూజీలాండ్, జపాన్, ఫ్రాన్స్, సౌతాఫ్రికా దేశాలలో ఉన్న అగ్ర యూనివర్సిటీలకు మాత్రమే అవకాశం ఉందన్నారు. ఆసక్తి గల వారు నవంబర్ 19వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ములుగు రూరల్: నేడు (మంగళవారం) నిర్వహించనున్న డయల్ యువర్ డీఎం కార్యక్రమాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని వరంగల్–2 డిపో మేనేజర్ రవిచందర్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
దరఖాస్తుల స్వీకరణ


