దళారులకు పత్తి అమ్మి మోసపోవద్దు
చిట్యాల: రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పత్తి పంటను దళారులకు అమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన సీసీఐ కొనుగోలు కేంద్రంలోనే అమ్ముకోవాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. సోమవారం మండలకేంద్రంలోని శాంతినగర్ శివారులోని అంజనీ ఆగ్రో ఇండస్ట్రీస్ కాటన్ మిల్లులో సీసీఐ కోనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సీసీఐ కొనుగోలు కేంద్రంలో ప్రైవేట్ వ్యాపారులను పోత్సహించవద్దని అన్నారు. కొనుగోలు కేంద్రానికి రైతులు పత్తిని తీసుకొచ్చేటప్పుడు తేమ లేకుండా చూసుకోవాలని అన్నారు. సీసీఐ కేంద్రాలలో పత్తిని విక్రయించాలంటే తప్పనిసరిగా కిసాన్ యాప్ ద్వారా స్లాట్ బుక్ చేసుకోవాలని పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రంలో రైతులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మార్కెటింగ్ అధికారి ప్రవీన్‌కుమార్, సీసీఐ అధికారి పట్టాభిరామయ్య, మార్కెట్ సెక్రటరీ లా షరీఫ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఎండీ.రఫీ, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గూట్ల తిరుపతి, నాయకులు ముకిరాల మధువంశీకృష్ణ, పులి తిరుపతిరెడ్డి, చిలుకల రాయకొంరు, దొడ్డి కిష్టయ్య, డైరెక్టర్‌లు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు
సీసీఐ కొనుగోలు కేంద్రం ప్రారంభం


