సింగరేణి కమ్యూనిటీ హాల్‌లో కోర్టు సముదాయం
భూపాలపల్లి అర్బన్: జిల్లా కేంద్రంలోని సుభాష్‌కాలనీ రోడ్డులోని సింగరేణి కమ్యూనిటీహాల్‌లో తాత్కాలిక కోర్టు సముదాయం ఏర్పాటు చేయనున్నట్లు భూపాలపల్లి బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్రావణ్‌రావు తెలిపారు. స్థానిక బార్ అసోసియేషన్ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 10వ తేదీన అదనపు కలెక్టర్ (రెవెన్యూ) అశోక్‌కుమార్ అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేసి అద్దె ప్రతిపాదికన ఒప్పందం కుదిర్చినట్లు తెలిపారు. అతి త్వరలోనే కోర్టు సముదాయం నందు అన్ని కోర్టు సేవలు ఒకే చోట ఉండటం వలన కక్షిదారులకు, పోలీసు, అన్ని ప్రభుత్వ శాఖలకు అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు. ఇందుకు సహకరించిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, కలెక్టర్ రాహుల్‌శర్మ, సింగరేణి జీఎం రాజేశ్వర్‌రెడ్డి, ఎస్పీ కిరణ్‌ఖరే, కార్మిక సంఽఘాలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సమావేశంలో బార్ అసోసియేషన్ సభ్యులు సంగెం రవీందర్, మంగళపల్లి రాజ్‌కుమార్, శివకుమార్ పాల్గొన్నారు.


