పకడ్బందీగా ఎస్‌ఐఆర్ రివిజన్
● కలెక్టర్ రాహుల్ శర్మ
భూపాలపల్లి: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్‌ఐఆర్)ను పకడ్బందీగా తయారు చేస్తామని కలెక్టర్ రాహుల్ శర్మ వెల్లడించారు. ఎస్‌ఐఆర్ తయారీపై శనివారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు పలు సూచనలు చేసిన అనంతరం కలెక్టర్ మాట్లాడారు. ఎస్‌ఐఆర్ మ్యాపింగ్‌లో భాగంగా కేటగిరి ఏని బీఎల్‌ఓ యాప్ ద్వారా ధృవీకరిస్తామని, కేటగిరి సీ, డీ లను లింక్ ద్వారా ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. ఈఆర్‌ఓ కార్యాలయంలో బూత్ స్థాయి అధికారులను ప్రత్యేకంగా కేటాయించి త్వరితగతిన మ్యాపింగ్ పూర్తి చేస్తామని వెల్లడించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్, ఆర్డీఓ రవి, ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు.


