రామప్ప శిల్పకళా సంపద మరుపురానిది..
వెంకటాపురం(ఎం): రామప్ప శిల్పకళ సంపద మరుపురానిదని త్రిపుర ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ చైర్మన్ హేమంత్ వర్మ అన్నారు. ఉమ్మడి వరంగల్‌లోని పర్యాటక క్షేత్రాల సందర్శనకు వచ్చిన ఆయన శనివారం మండల పరిధిలోని రామప్ప దేవాలయాన్ని సందర్శించారు. రామప్ప రామలింగేశ్వరస్వామికి పూజలు నిర్వహించగా ఆలయ పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. ఆలయ విశిష్టతను గైడ్ విజయ్‌కుమార్ వివరించగా రామప్ప శిల్పకళసంపద బాగుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎన్‌పీడీసీఎల్ ములుగు డీఈ పులుసం నాగేశ్వర్ రావు, ఏడీఈ వేణుగోపాల్, అధికారులు పురుషోత్తం, రమేశ్, కిశోర్, శ్రీనివాసులు పాల్గొన్నారు.


