కాలసర్ప, శని పూజలకు భక్తుల రద్దీ
కాళేశ్వరం: కాళేశ్వరం దేవస్థానంలోని శ్రీసుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో కాలసర్ప, నవగ్రహాల వద్ద శని నివారణ పూజలను భక్తులు శనివారం అధికంగా నిర్వహించారు. దీంతో ఆలయ పరిసరాలు, గోదావరి తీరం వద్ద భక్తుల సందడి నెలకొంది.
కార్తీక సందడి..
కార్తీకమాసం సందర్భంగా కాళేశ్వరం ఆలయంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరుడిని భక్తులు దర్శించుకున్నారు. ఉదయం నుంచి త్రివేణి సంగమ గోదావరిలో పుణ్యస్నానాలు చేసి స్వామివారి గర్బగుడిలో అభిషేక పూజలు చేశారు. అనంతరం శ్రీశుభానందదేవి, సరస్వతి అమ్మవార్ల ఆలయంలో కుంకుమార్చన పూజలు నిర్వహించారు. ఉసిరి చెట్టు వద్ద మహిళలు ప్రదక్షిణలు చేశారు. లక్షవత్తులు వెలిగించి లక్ష ముగ్గులు వేశారు. దీంతో భక్తుల సందడి కనిపించింది.
కాలసర్ప, శని పూజలకు భక్తుల రద్దీ


