క్రీడలతో దేహదారుఢ్యం
భూపాలపల్లి అర్బన్: క్రీడలతో కేవలం ఆనందం మాత్రమే కాకుండా శారీరక దృఢత్వానికి, పట్టుదలకు దారితీసే మంచి మార్గమని ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. సింగరేణి వర్క్‌పీపుల్స్, గేమ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 26వ వార్షిక క్రీడ పోటీల్లో భాగంగా గురువారం సింగరేణి విభాగాల క్రికెట్ పోటీలను ప్రారంభించారు. స్థానిక అంబేడ్కర్ స్టేడియంలో జరిగిన ఈ క్రీడా పోటీల ప్రారంభోత్సవానికి జీఎం ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ.. క్రీడాకారులు క్రీడల ప్రాముఖ్యత ను మనస్ఫూర్తిగా గ్రహించి పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ క్రీడలను భాగస్వామ్యం చేసుకొని ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంభించాలన్నా రు. కోలిండియా స్థాయిలో రాణించాలనే ఉద్దేశంతో క్రీడాకారులను ప్రోత్సహిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో అధికా రులు గుండు రాజు, శ్రావణ్‌కుమార్, నాగేశ్వర్‌రావు, ప్రసాద్, దేవేందర్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్
రాజేశ్వర్‌రెడ్డి


