రేపటి ధర్నాను విజయవంతం చేయాలి
భూపాలపల్లి రూరల్: బీసీలకు 42శాతం రిజర్వేషన్లను అమలు చేయాలని కోరుతూ ఈనెల 24న హైదరాబాద్‌లో తలపెట్టిన ధర్నాను విజయవంతం చేయాలని బీసీ జేఏసీ నాయకుడు కొత్తూరు రవీందర్ పిలుపునిచ్చారు. బుధవారం జిల్లా కేంద్రంలో ధర్నా పోస్టర్లను జేఏసీ నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యా ఉద్యోగ స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు బొజ్జపల్లి మహర్షి, రేణుకుంట్ల మహేష్, మల్లయ్య, మంత్రి రాకేష్, బోయిని ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


