పాఠశాలల ఆకస్మిక తనిఖీ
మొగుళ్లపల్లి: మండలంలోని ఎంజేపీ, కేజీబీవీ, వి లేజ్ లీగల్ కేర్ సపోర్ట్ సెంటర్‌ను బుధవారం తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ మెంబర్ సెక్రటరీ, జడ్జి చిలుకమారి పంచాక్షరి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ బృందంతో కలిసి వంట గదులు, డైనింగ్ హాల్, మరుగుదొడ్లను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నాణ్యమైన భోజనంతో పాటు విద్యనందించాలన్నారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యంతో చదవాలన్నారు. ఈ కార్యక్రమంలో పీఎల్‌వీ మంగళపల్లి శ్రీనివాస్, ఎస్‌ఐ అశోక్ తదితరులు పాల్గొన్నారు.


