కార్తీక సందడి షురూ
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వరముక్తీశ్వరస్వామి ఆలయంలో కార్తీకమాసం మొదటిరోజు బుధవారం భక్తుల సందడి నెలకొంది. తెల్లవారుజామున త్రివేణి సంగమ గోదావరిలో ఫుణ్యస్నానాలు చేశారు. గోదావరిమాతకు ప్రత్యేక పూజలు చేసి దీపాలు వదిలారు. స్వా మి గర్భగుడిలో అభిషేక పూజలు చేశారు. ఉసిరి చె ట్టు వద్ద మహిళలు ప్రదక్షిణలు చేశారు. లక్ష ముగ్గులు వేసి, లక్షవత్తులు వెలిగించారు. అంతకుముందు ప్రాకార దేవతలను దర్శించుకున్నారు. దీంతో ఆలయ పరిసరాల్లో భక్తుల సందడి కనిపించింది. సాయంత్రం త్రివేణి సంగమం వద్ద గోదావరినదికి నదీహారతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
వెలిగిన ఆకాశ దీపం
కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వరముక్తీశ్వరస్వామి ఆల యం ధ్వజస్తంభం వద్ద కార్తీకమాసం మొదటి రోజు ఆకాశ దీపానికి ఆలయ ఉపప్రధాన అర్చకుడు పనకంటి ఫణీంద్రశర్మ విశేష పూజలు చేశారు. బుధవారం రాత్రి ధ్వజస్తంభంపైకి ఆకాశ దీపం వెలిగించి పైకి ఎత్తారు. నెల రోజుల పాటు ప్రతీ రోజు దీపాన్ని వెలిగిస్తారని పండితులు తెలిపారు.
కార్తీక సందడి షురూ


