ఉద్యోగులు సమయపాలన పాటించాలి
మొగుళ్లపల్లి: ఉద్యోగులు, ఆస్పత్రి సిబ్బంది సమయపాలన పాటించాలని డీఎంహెచ్‌ఓ మధుసూదన్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాజరు రిజస్టర్, లేబర్ రూమ్, ఆయుష్, యోగా రూమ్‌లను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైద్యులు, సిబ్బంది సమయ పాలన పాటించాలని, లేదంటే శాఖాపరమైన చర్యలు తప్పవన్నారు. ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన సేవలు అందించాలన్నారు. అనంతరం మండల కేంద్రంలోని ఉప కేంద్రాన్ని తనిఖీ చేసి రికార్డులు పరిశీలించి వాక్సినేషన్, టీబీ సీజన్ వ్యాధుల గూర్చి ఎన్‌సీడీ తదితర అంశాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ నాగరాణి, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ రాజేంద్రప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు.
డీఎంహెచ్‌ఓ మధుసూదన్


