నేరాల నియంత్రణకు కృషి
టేకుమట్ల: నేరాల నియంత్రణకు కృషి చేయాలని, శాంతి భద్రతలు కాపాడాలని డీఎస్పీ సంపత్‌రావు అన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా టేకుమట్ల పోలీస్‌స్టేషన్‌ను బుధవారం తనిఖీ చేశారు. స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ నమోదైన కేసుల వివరాలు తెలుసుకుని పెండింగ్ వాటిపై దృష్టి సారించాలన్నారు. అవాంఛనీయ సంఘటనలు, అసాంఘిక కార్యకలాపాలు చోటు చేసుకోకుండా ఖచ్చితమైన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలన్నారు. రాత్రి వేళల్లో ప్రత్యేకంగా పెట్రోలింగ్ చేపట్టాలన్నారు. ప్రజా ఫిర్యాదులో ఎటువంటి జాప్యం చేయకుండా తక్షణమే స్పందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చిట్యాల సీఐ మల్లెష్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
డీఎస్పీ సంపత్‌రావు


