వైభవంగా దీపావళి సంబురాలు
భూపాలపల్లి అర్బన్: వెలుగుల పండుగ దీపావళిని సోమ, మంగళవారాల్లో జిల్లా ప్రజలు వైభవంగా జరుపుకున్నారు. ఇంట్లో, వ్యాపార సంస్థల్లో లక్ష్మీదేవి పూజలు, కేదారేశ్వర వత్రాలు నిర్వహించారు. తెల్లవారు జాము నుంచే ప్రజలు తలంటుస్నానం ఆచరించి, హారతులను తీసుకుని ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఇళ్ల ముందు రంగవల్లులు, మామిడి, అరటి తోరణాలను ఏర్పాటు చేసి, విద్యుత్ దీపాలతో అలంకరించారు. బొమ్మల కొలువులు, ప్రత్యేక కార్యక్రమాలతో ప్రతీ ఇంటా సంతోషాల కాంతులు విరబూశాయి.
ఆకాశంలో వెలుగులు..
కేదారేశ్వర వత్రం ముగించుకున్న తర్వాత రాత్రివేళ టపాసుల మోతతో ఆకాశం వెలుగులతో నిండిపోయింది. క్రాకర్స్, లక్ష్మీ బాంబులు, రాకెట్స్, చిచ్చుబుండీ, భూ చక్రాల సవ్వడితో చిన్నారులు, పెద్దలు మురిసిపోయారు. కుటుంబ సభ్యులు ఒక్కచోట చేరి తమ ఆనందాన్ని పంచుకున్నారు.
గృహాలు, వ్యాపార సంస్థల్లో లక్ష్మీపూజలు, కేదారేశ్వర వ్రతాలు పట్టణం, పల్లెల్లో బాణసంచా మోత
వైభవంగా దీపావళి సంబురాలు
వైభవంగా దీపావళి సంబురాలు
వైభవంగా దీపావళి సంబురాలు
వైభవంగా దీపావళి సంబురాలు


