తెలంగాణ రైజింగ్‌ సర్వేలో పాల్గొనాలి | - | Sakshi
Sakshi News home page

తెలంగాణ రైజింగ్‌ సర్వేలో పాల్గొనాలి

Oct 22 2025 7:14 AM | Updated on Oct 22 2025 7:14 AM

తెలంగ

తెలంగాణ రైజింగ్‌ సర్వేలో పాల్గొనాలి

భూపాలపల్లి అర్బన్‌: తెలంగాణ రైజింగ్‌–2047 సిటిజన్‌ సర్వేలో పాల్గొనాలని కలెక్టర్‌ రాహుల్‌ శర్మ మంగళవారం ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్ర భవిష్యత్‌ రూపకల్పనకు ఉద్దేశించిన సర్వేకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందన్నారు. భారతదేశ స్వాతంత్య్రానికి వంద సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా 2047 నాటికి తెలంగాణ రాష్ట్రం ఎలా ఉండాలో ప్రజల నుంచి పలు సలహాలు, సూచనలు చేపట్టడానికి ప్రభుత్వం తెలంగాణ రైజింగ్‌ –2047 సిటిజన్‌ సర్వేను చేపట్టిందన్నారు. ప్ర భుత్వం గత వారం ప్రారంభించిన ఈ సర్వే ఈ నెల 25వ తేదీతో ముగుస్తుందని, జిల్లా ప్రజ లు తెలంగాణరైజింగ్‌ అనే వెబ్‌సైట్‌ను సంద ర్శించి సూచనలు, సలహాలు ఇవ్వాలన్నారు.

గురుకులాల్లో ఖాళీ సీట్ల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

భూపాలపల్లి అర్బన్‌: జిల్లాలోని ఎస్సీ బాలికల గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో ఖాళీ సీట్ల భర్తీకి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు జిల్లా కన్వీనర్‌, కలెక్టర్‌ రాహుల్‌శర్మ మంగళవారం ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా పరిధిలోని చిట్యాల, కాటారం, శాయంపేట సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలల్లో 5 నుంచి 9వ తరగతి వరకు పరిమిత సంఖ్యలో ఖాళీలు ఉన్నట్లు తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరి గిన ప్రవేశ పరీక్ష రాసిన వారికి మొదటి ప్రాధాన్యం ఉంటుందన్నారు. దరఖాస్తులను ఈ నెల 24వ తేదీలోపు చిట్యాల గురుకుల పాఠశాలలో దరఖాస్తులను అందించాలన్నారు.

నాణ్యమైన పెట్రోల్‌ అందించాలి

మల్హర్‌: వినియోగదారులకు నాణ్యమైన పెట్రోల్‌, డీజిల్‌ అందించాలని డీసీఎస్‌ఓ కిరణ్‌కుమార్‌, జిల్లా లీగల్‌ మెట్రాలజీ అధికారి శ్రీలత అన్నారు. విని యోగదారుల ఫిర్యాదు మేరకు మంగళవారం తాడిచర్ల హెచ్‌పీసీఎల్‌ పెట్రోల్‌ బంక్‌లో తనిఖీ చేపట్టా రు. గాలి పంపు, మంచినీరు, మరుగుదొడ్లు తదితర సౌకర్యాలను పరిశీలించారు. పెట్రోల్‌, డీజిల్‌ నాణ్య త, వ్యత్యాసాన్ని పరిశీలించేందుకు నమూనాలను సేకరించారు. వినియోగదారులకు నాణ్యమైన పెట్రోల్‌, సౌకర్యాలు కల్పించకుంటే చర్యలు తప్పవన్నారు. అనంతరం మల్లారం రైస్‌ మిల్లును పరిశీలించారు. కార్యక్రమంలో సివిల్‌ సప్లయీస్‌ ఆర్‌ఐ సురేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి

భూపాలపల్లి రూరల్‌: భూపాలపల్లి మున్సిపాలిటీ అభివృద్ధి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డి రూ.50కోట్ల ప్రత్యేక నిధులను మంజూరు చేసినందున పార్టీ పట్టణ అధ్యక్షుడు దేవన్‌ ఆధ్వర్యంలో మంగళవారం అంబేడ్కర్‌ సెంటర్‌లో ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని, రూ.50కోట్లతో రోడ్లు, కాల్వలు, తాగునీటి సౌకర్యం, పట్టణ సుందరీకరణ, జంక్షన్‌ల అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. అమృత్‌ సర్‌ పథకం కింద రూ.23 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ మాజీ కౌన్సిలర్స్‌, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ రైజింగ్‌ సర్వేలో పాల్గొనాలి1
1/1

తెలంగాణ రైజింగ్‌ సర్వేలో పాల్గొనాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement