
రైతుల కష్టం వరదపాలు
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లతిమ్మాపూర్, వెంకటాపూర్ గ్రామాల్లో రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం అధికారుల నిర్లక్ష్యం మూలంగా వరదపాలైంది. అకాల వర్షాలు దండికొట్టడంతో 45రోజులుగా తూకం వేయకుండా కేంద్రాల్లోనే ఉన్న ధాన్యం వర్షానికి తడిసి మొలకెత్తింది. దీంతో అన్నదాతలకు అపార నష్టం వాటిల్లింది. ఐకేపీ అధికారులు, నిర్వహకుల నిర్లక్ష్యం వల్ల మాయిచ్చర్ వచ్చి 45 అయినప్పటికీ రైతులు కేంద్రాలకు తెచ్చిన వడ్లను తూకం వేయలేదు. కేంద్రాల్లో హమాలీలు లేక, నిర్వహకులు పట్టించుకోకపోవడం వల్లనే ఈ పరిస్థితి వచ్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరుతున్నారు.
తడిసి మొలకెత్తిన ధాన్యం