
ప్రపంచ అర్చరీ పోటీలకు చికిత
కరీంనగర్‌స్పోర్ట్స్: ప్రపంచ అర్చరీ క్రీడాకారిణి, పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం సుల్తాన్‌పూర్‌కు చెందిన తానిపర్తి చికిత జూన్‌లో సింగపూర్‌లో, ఆగస్టులో కెనడాలో జరగబోయే ప్రపంచస్థాయి పోటీల్లో పాల్గొనే భారత మహిళల కంపౌండ్ క్రీడాకారుల జట్టులో చోటు సంపాదించింది. మహిళల కంపౌండ్ విభాగంలో ప్రపంచ ర్యాంకింగ్‌లో 71వ స్థానంలో కొనసాగుతోంది. ఏషియా కప్‌స్టేజ్ 2 పోటీలు సింగపూర్‌లో జూన్ 14 నుంచి 21 వరకు, వరల్డ్ యూత్ చాంపియన్ షిప్ పోటీలు ఆగస్టు 16 నుంచి 25వరకు కెనడాలోని విన్నిపెగ్‌లో జరుగనున్నాయి. పూణెలో జరిగిన ఇండియన్ టీంసెలక్షన్ ట్రయల్స్‌లో చికిత అద్భుతంగా రాణించి చోటు దక్కించుకుంది. ఏషియా, వరల్డ్ యూత్ చాంపియన్ షిప్ పోటీలకు తానిపర్తి చికిత ఎంపికకావడంపై ఉమ్మడి జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్ష కార్యదర్శులు నందెల్లి మహిపాల్, గసిరెడ్డి జనార్దన్‌రెడ్డి, కోశాధికారి నాగిరెడ్డి సిద్దారెడ్డి, ఉపాధ్యక్షుడు తుమ్మల రమేశ్‌రెడ్డి, మహ్మద్ కరీం, పెద్దపల్లి డీవైఎస్‌వో సురేశ్, బేస్‌బాల్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, ఉమ్మడి జిల్లా అర్చరీ సంఘం కార్యదర్శి కొమురాజు శ్రీనివాస్, కొమురాజు కృష్ణ తదితరులు హర్షం వ్యక్తం చేశారు.