రాజపక్సే రాజీనామా.. నిరసనకారుల దాడిలో అధికార పార్టీ ఎంపీ మృతి

Sri Lanka MP Amarakeerthi Athukorala Killed In Clashes - Sakshi

Sri Lanka MP Amarakeerthi Athukorala.. శ్రీలంకలో రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. ఆర్థిక సంక్షోభం కారణంగా లంక అధ్యక్షుడు, ప్రధానిపై విపక్షనేతలు, లంకేయులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో లంక ప్రధాని మహీంద రాజపక్స తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటు కోసం అధ్యక్షుడు గొటబయ రాజపక్సే.. అత్యవసర సమావేశం ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తోంది. 

ఇదిలా ఉండగా లంక రాజధాని కొలంబోలో సోమవారం నిరసనలు పీక్‌ స్టేజ్‌కు చేరుకున్నాయి. రాజపక్సే మద్దతుదారులు నిరసనకారులను కర్రలతో చితకబాదారు. పోలీసులు నిరసనకారులపై టియర్‌ గ్యాస్‌, వాటర్‌ కెనన్లను ప్రయోగించారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో అధికార పార్టీకి చెందిన ఎంపీ అమరకీర్తి అత్తుకోరల నిరసనకారులపై కాల్పులు జరిపారు. ఈ ఫైరింగ్‌లో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. 

దీంతో ఆగ్రహానికి లోనైన నిరసనకారులు ఆయన కారును అడ్డగించారు. ఈ క్రమంలో ఆయనపై దాడి చేయడంతో అమరకీర్తి మృతిచెందినట్టు లంక మీడియా తెలిపింది. తీవ్ర ఉద్రిక్తకర పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు కొలంబోలో కర్ఫ్యూ విధించారు. 

ఇది కూడా చదవండి: విక్టరీ డే రోజున పుతిన్‌కు ఊహించని షాక్‌

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top