గాల్లో దీపం పాక్‌ గగనతలం | India-Pakistan Tensions: Pakistan Failed With Made In China HQ-9 Air Defence System, Know More Details Inside | Sakshi
Sakshi News home page

గాల్లో దీపం పాక్‌ గగనతలం

May 9 2025 3:56 AM | Updated on May 9 2025 11:49 AM

Pakistan failed made in China HQ-9 air defence system

భారత క్షిపణుల రాకను పసిగట్టలేకపోయిన పాక్‌ ఎయిర్‌డిఫెన్స్‌ వ్యవస్థలు

చైనా తయారీ ఆయుధ వ్యవస్థలపై పూర్తిగా ఆధారపడిన పాక్‌

తరచూ మొరాయిస్తూ, రిపేర్లమయమైన వ్యవస్థ

పాకిస్తాన్‌పై ప్రళయ భీకరంగా భారత వైమానిక బలగాలు దాడి చేస్తుంటే ఆ దేశ రక్షణ వ్యవస్థ చేష్టలుడిగి చూసిందన్న వార్త నేపథ్యంలో అసలు ఈ ధూర్తదేశ గగనతలానికి రక్షణ ఉందా? ఉంటే ఎలాంటి ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థలను పాకిస్తాన్‌ మోహరించిందనే సందేహాలు సర్వత్రా వ్యక్తమ వుతున్నాయి. శతఘ్నులు, యుద్ధ విమానాలు మొదలు జలాంతర్గాములదాకా చాలా రకాల ఆ యుధాలపై పాకిస్తాన్‌ చైనా మీదనే ఆధారపడు తోంది.

 గగనతల రక్షణ వ్యవస్థలను సైతం చైనా నుంచే కొనుగోలు చేసింది. పాకిస్తాన్‌ మోహరించిన హెచ్‌క్యూ–9పీ, హెచ్‌క్యూ–16 గగనతల రక్షణ వ్యవస్థలను భారత్‌ నాశనంచేసింది. ము ఖ్యంగా లాహోర్, సియాల్‌కోట్‌లలో మోహరించిన హెచ్‌క్యూ–9పీ ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థను భారత వైమానిక దళాలు ధ్వంసంచేశాయి. చైనా తన కోసం తయారుచేసుకున్న హెచ్‌క్యూ–9 రకం వ్యవస్థను పాకిస్తాన్‌ కోసం కాస్త మార్పులు చేర్పులుచేసి ఆ దేశానికి అమ్మేసింది.

 ‘‘రష్యా తయారుచేసిన ఎస్‌–300 మిస్సైల్‌ వ్యవస్థను చైనా తయారీ హెచ్‌క్యూ–9 క్షిపణి వ్యవస్థ పోలి ఉంటుంది. పాకిస్తాన్‌లోని పంజాబ్‌ ప్రావిన్సుపై భారత క్షిపణులు విరుచుకుపడుతున్నా పాకిస్తాన్‌ గగనతల రక్షణవ్యవస్థలు ఏమాత్రం పసిగట్టలేక పోయాయి. ఇది పూర్తిగా ఎయిర్‌డిఫెన్స్‌ వ్యవస్థ వైఫల్యాన్ని అద్దంపడుతోంది’’ అని యుద్ధరంగ నిపుణుడు సందీప్‌ ఉన్నిథాన్‌ చెప్పారు. ‘‘ దూసుకొస్తున్న శత్రుదేశాల క్షిపణులు, ఆత్మాహుతి డ్రోన్లను ముందుగా కనిపెట్టాల్సిన గురుతర, కీలక బాధ్యత ఈ ఎయిర్‌డిఫెన్స్‌ వ్యవస్థలదే. రక్షణ, వైమానిక స్థావరాల రక్షణకు ఇదే ప్రాణం. అలాంటి వ్యవస్థలే విఫలమైన నేపథ్యంలో త్వరలో భారత్‌ జరపబోయే దాడులను అడ్డుకునే వ్యవస్థ ఇక లాహోర్, సియాల్‌కోట్‌ వంటి చోట్ల లేదనే చెప్పాలి’’ అని ఉన్నిథాన్‌ వ్యాఖ్యానించారు. 

అంతా మేకపోతు గాంభీర్యం
భారత్‌ దాడి చేస్తే ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధంగా ఉన్నామని పాకిస్తాన్‌ గతంలోనే ప్రకటించింది. తమ వైమానిక, క్షిపణి విధ్వంసక వ్యవస్థలను వ్యూహాత్మక ప్రాంతాల్లో మోహరించామని, ఎలాంటి దాడినైనా ఎదుర్కొనే సత్తా తమకు ఉందని ఇన్నాళ్లూ పాకిస్తాన్‌ చేసిన భీష్మ ప్రతిజ్ఞలన్నీ కేవలం మేకపోతు గాంభీర్యమని బుధవారం నాటి భారతదాడితో తేలిపోయింది. అరగంటలోపు రెండు డజన్లకుపైగా క్షిపణులతో భారత్‌ విరుచుకుపడుతుంటే వాటిని పాక్‌ గగనతల వ్యవస్థలు అడ్డుకోలేకపోయాయి. 

మూడేళ్ల క్రితం అత్యాధునిక బ్రహ్మోస్‌కు సంబంధించిన డమ్మీ క్షిపణి పొరపాటున పాకిస్తాన్‌ గగనతలంలోకి దూసుకెళ్లినప్పుడు కూడా పాక్‌ ఎయిర్‌డిఫెన్స్‌ వ్యవస్థ దానిని కూల్చలేకపోయాయి. అటుగా మన క్షిపణి వెళ్లిన విషయాన్ని మొదట స్వయంగా భారతే ప్రకటించింది. ఇప్పుడు లాహోర్, సియాల్‌కోట్‌లోనూ ఇదే వైఫల్యం పునరావృతమైంది. 2019లో భారత వైమానిక దాడులు చేసిన బాలాకోట్‌లో ముష్కరుల స్థావరాలను నేలమట్టంచేసింది. ఆరోజు సైతం భారత గగనతల సంచారాన్ని పాక్‌ గగనతల వ్యవస్థలు ఏమాత్రం కనిపెట్టలేకపోయాయి.   

వేధిస్తున్న సాంకేతిక సమస్యలు
చైనా తయారీ రక్షణ వ్యవస్థలు తరచూ మొరాయి స్తుండటం, రిపేర్లమయం కావడం పాకిస్తాన్‌కు పెద్ద సమస్యగా తయారైంది. పాకిస్తాన్‌ తన రక్షణవ్యవ స్థలకు భారీగా నిధులను కేటాయించలేకపో వడమూ ఇందుకు ప్రధాన కారణం. ఉన్న ఆయు« దాలతోనే ఎలాగోలా పాక్‌ సాయుధబలగాలు నెట్టుకొస్తున్నట్లు తెలుస్తోంది. గగనతల రక్షణ వ్యవ స్థలను వాస్తవానికి ఎప్పటికప్పుడు ఆధునీకరించుకోవాలి. ఇప్పటికే పేదరికం, ద్రవ్యోల్బణం, అప్పులతో కుదేలైన పాకిస్తాన్‌కు ఎప్పటికప్పుడు కొత్త వ్యవస్థను కొనే ఆర్థిక దమ్ము లేదు. ఇవన్నీ కలిసి ఇప్పుడు దాని గగనతల రక్షణ వ్యవస్థను మరింత నిర్వీర్యం చేస్తున్నాయి.

పాకిస్తాన్‌ వద్ద ఉన్న వ్యవస్థలేంటి?
హెచ్‌క్యూ–9పీ, హెచ్‌క్యూ–9బీఈ, ఎఫ్‌ డీ– 2000, హెచ్‌క్యూ–16ఎఫ్‌ఈ గగనతల రక్షణ వ్యవస్థలపై పాక్‌ ఆధా రపడుతోంది. వీటితోపాటే పాతతరం ఎల్‌వై–80, ఎఫ్‌ఎం–90 రకాలూ ఎంతోకొంత పాక్‌కు సాయపడుతున్నాయి. 40 కిలోమీటర్ల స్థాయిలో లక్ష్యాలను ఛేదించడానికి ఎల్‌వై–80ను పాక్‌ వాడుతోంది. మే 7వ తేదీ అర్థరాత్రి దాటాక భారత్‌ చేసిన దాడిలో హెచ్‌క్యూ–16 వ్యవస్థ నాశనమైంది. చైనా నుంచి 2021లో హెచ్‌క్యూ–9పీ దీర్ఘశ్రేణి గగనతల రక్షణ వ్యవస్థను దిగుమతి చేసుకుంది. తమ గగనతలంలోకి వచ్చిన శత్రు క్షిపణులను 125 కిలోమీటర్ల దూరం నుంచే గుర్తించి నేలమట్టంచేయగలదు. యుద్ధ విమానాలనూ అడ్డుకోగలదు. 
 
– సాక్షి, నేషనల్‌ డెస్క్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement