
సనా: యెమెన్ రాజధాని సనాలో హౌతీ గ్రూప్‌కి చెందిన సైనిక స్థావరాలపై ఇజ్రాయెల్ మెరుపు దాడులు చేసింది. ఈ దాడుల్లో హౌతీ గ్రూప్‌కి చావు దెబ్బ తగిలింది. ఇజ్రాయెల్ దళాలు జరిపిన మెరుపు దాడుల్లో హౌతీ ప్రధాన మంత్రి అహ్మద్ అల్-రహావీ తన అపార్ట్‌మెంట్‌లో మృతి చెందినట్లు తెలుస్తోంది. అహ్మద్ అల్-రహావీతో పాటు హౌతీ రక్షణ మంత్రి మొహమ్మద్ అల్-అతిఫీ, చీఫ్ ఆఫ్ స్టాఫ్ అల్-ఘమారి కూడా మరణించినట్లు సమాచారం.
అయితే, వీరి మరణాలపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. కాగా ఇజ్రాయెల్ ఈ దాడులను హౌతీల మిస్సైల్, డ్రోన్ దాడులకు ప్రతీకారంగా చేపట్టింది. ఈ దాడుల్ని హౌతీ గ్రూప్ తీవ్రంగా ఖండిస్తోంది. ఐడీఎఫ్ తమ పౌర ప్రాంతాలపై దాడులు చేసిందని, ఇది అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని ధ్వజమెత్తింది. మరోవైపు అహ్మద్ అల్-రహావీ మృతిని ధృవీకరిస్తూ యెమెన్ మీడియా సైతం పలు కథనాల్ని ప్రచురించింది. కానీ ఇజ్రాయెల్ అధికారికంగా ధృవీకరించలేదు.
Israeli airstrike in Yemen kills Houthi PM Ahmed al-Rahawi: Report pic.twitter.com/f9zmjyPFo5
— The Tatva (@thetatvaindia) August 29, 2025
కాగా, యెమెన్ రాజధాని సనాపై ఇజ్రాయెల్ చేసిన వైమానిక దాడుల్లో గత ఆదివారం ఆరుగురు మృతి చెందగా.. 86 మందికి గాయపడ్డారు. ఈ దాడుల్లో 10 ఇజ్రాయెలీ యుద్ధం విమానాలు రాజధాని సనాలోని కీలక ప్రాంతాలపై బాంబుల వర్షం కురిపించింది. అసర్ చమురు క్షేత్రం, హిజాజ్ పవర్ ప్లాంట్ లక్ష్యంగా దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. అయితే, గత కొన్ని నెలలుగా హమాస్‌కు మద్దతుగా హూతీ తిరుగుబాటుదారులు ఇజ్రాయెల్‌పై క్షిపణి దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే.