TV Debate: మోదీతో టీవీలో చర్చలు జరపడం ఇష్టం: ఇమ్రాన్‌ ఖాన్‌

Imran Khan Said He Would love To Debate With Modi On Tv - Sakshi

భారత ప్రధానమంత్రి  నరేంద్ర మోదీతో టీవీలో డిబేట్ చేయడానికి ఇష్టపడతాననని పాక్‌ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాస్కో పర్యటన సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. చర్చల ద్వారా విభేదాలను పరిష్కరించగలిగితే అది భారత ఉపఖండంలోని బిలియన్లకుపైగా ప్రజలకు ప్రయోజనకరంగా ఉంటుందని అన్నారు. అంతేకాదు ఇరు దేశాల మధ్య నెలకొన్న విభేదాలను పరిష్కరించేందుకు ప్రధాని నరేంద్ర మోదీతో టెలివిజన్‌లో చర్చలు జరపాలనుకుంటున్నట్లు ఇమ్రాన్ ఖాన్‌ పేర్కొన్నారు.

పైగా భారతదేశంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఇరుదేశాల మధ్య వాణిజ్యం తగ్గిపోయిందని తెలిపారు. అన్ని దేశాలతో వాణిజ్య సంబంధాలను కలిగి ఉండటమే తన ప్రభుత్వ విధానం స్పష్టం చేశారు. అయితే ఈ విషయమై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ నోరు మెదపలేదన్నారు. పలు కారణాలతో  పాకిస్తాన్ ప్రాంతీయ వాణిజ్య ఎంపికలు ఇప్పటికే పరిమితంగా ఉన్నాయని చెప్పుకొచ్చారు.

ఉక్రెయిన్‌లో ప్రస్తుత సంక్షోభానికి ముందు ఆర్థిక సహకారంపై చర్చల కోసం ఇమ్రాన్‌ఖాన్‌.. రెండు రోజుల మాస్కో పర్యటన చేయనున్నారు. ఈ మేరకు ఉక్రెయిన్ సంక్షోభం గురించి ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ.. ‘ఇది మా పరిధిలోని విషయం కాదు. మాకు రష్యాతో ద్వైపాక్షిక సంబంధం ఉంది. మేము దానిని బలోపేతం చేయాలని భావిస్తున్నాం’ అని అన్నారు.

మరోవైపు భారత్‌ మాత్రం ఉగ్రవాద రహిత వాతావరణంలో మాత్రమే పాక్‌తో చర్చలు జరుగుతాయని స్పష్టం చేసింది. చర్చలు జరిగే ముందు ఉగ్రవాదంపై అణిచివేతకు సంబంధించిన ఆధారాలు చూపించాలని కూడా పాక్‌ను ఇండియా కోరింది. అంతేకాదు భారతదేశం పాకిస్తాన్ సరిహద్దు ఉగ్రవాదాన్ని కూడా అంతం చేయాలని డిమాండ్ చేస్తోంది.

(చదవండి: ఇది కుట్రలో భాగమేనా?.. అనుమానాస్పదంగా చైనా చర్యలు)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top