సిగ్నల్‌లో ఖాతా, మార్క్ జూకర్‌బర్గ్ ఫోన్ నెంబర్ లీక్

Facebook data breach: Mark Zuckerberg uses Signal; phone number leaked - Sakshi

ఫేస్‌బుక్‌లో మరోభారీ డాటా బ్రీచ్‌

533 మిలియన్ల ఫేస్‌బుక్ వినియోగుదారుల  డేటా లీక్‌

జుకర్‌ బర్గ్‌ వ్యక్తిగతవివరాలు లీక్‌

సిగ్నల్‌లో ఖాతా, ఫోన్‌ నెంబరు లీక్‌

సాక్షి, న్యూఢిల్లీ: సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌లో మరోసారి హ్యాకింగ్‌కు గురి కావడం  ఆందోళన రేపిన సంగతి తెలిసిందే. అయితే  అతిపెద్ద  డేటా  బ్రీచ్‌గా చెబుతున్న తాజా కేసులో ఏకంగా ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ ఫోన్ నంబర్ కూడా లీక్‌ కావడం  గమనార్హం.  మార్క్ జుకర్‌బర్గ్ సిగ్నల్‌  యాప్‌ను‌ వినియోగిస్తున్నారనీ,  ఆయన ఫోన్ నంబర్ ఆన్‌లైన్‌లో లీక్ అయిందని భద్రతా పరిశోధకుడు వెల్లడించారు.  అలాగే 533 మిలియన్ల  ఫేస్‌బుక్ వినియోగుదారుల వ్యక్తిగత వివరాలు లీకైనట్టు తెలిపారు. ఈ 533 మిలియన్ల మందిలో  60లక్షలమంది భారతీయ వినియోగదారులున్నారు. అమెరికాకు చెందిన వారు 32 మిలియన్లు, 11 మిలియన్ల యూజర్లు యూకేకు చెందినవారున్నారు. ఈ ఫోన్ నంబర్ల డేటాబేస్ హ్యాకర్ల ఫోరమ్‌లో పోస్ట్ చేసినట్టు నివేదించిన సంగతి తెలిసిందే. డేటా లీక్‌కు ప్రభావితమైన వారిలో ఫేస్‌బుక్‌ సహ వ్యవస్థాపకులు డస్టిన్  మోస్కోవిట్జ్ , క్రిస్ హ్యూస్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది.

భద్రతా నిపుణుడు డేవ్ వాకర్ అందించిన సమాచారం ప్రకారం జుకర్‌ పేరు, పుట్టిన తేదీ,  వివాహం,  ఫేస్‌బుక్ యూజర్ ఐడీ తదితర వివరాలన్నీ  లీక్‌ అయ్యాయి. అలాగే జుకర్‌బర్గ్ లీకైన ఫోన్ నంబర్ స్క్రీన్ షాట్‌తో పాటు" మార్క్ జుకర్‌బర్గ్ సిగ్నల్‌లోఖాతా ఉందంటూ ట్విట్‌ చేశారు. మరొక భద్రతా నిపుణుడు అలోన్ గాల్ ప్రకారం, ఫేస్‌బుక్‌ ఖాతాకు లింక్ చేయబడిన ఫోన్ నెంబర్ల  ద్వారా  ఈ హ్యాకింగ్‌  గత జనవరిలోనే జరిగిందన్నారు. దీనిపై స్పందించిన ఫేస్‌బుక్ ఇదంతా పాత డేటా అని కొట్టిపారేసింది. 2019 ఆగస్టులో ఈ లోపాన్ని సరిదిద్దామని పేర్కొంది. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top