
మోకాళ్లపై కార్మికుల నిరసన
మంగళగిరి టౌన్: మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని సీఐటీయూ నాయకులు విమర్శించారు. మంగళగిరి నగర పరిధిలోని ఎంటీఎంసీ కార్యాలయం ఎదుట బుధవారం ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కార్మికులు మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. వేతనాలు పెంచడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు వై. కమలాకర్, ఎం. బాలాజీ, యూనియన్ నాయకులు శ్రీనివాసరావు, కేదారనాథ్, దుర్గారావు, ప్రకాష్, రాము పాల్గొన్నారు.