
కూటమి సర్కార్‌కు తీరని రక్త దాహం
నగరంపాలెం (గుంటూరు వెస్ట్): కూటమి ప్రభుత్వానికి రక్త దాహం తీరినట్టులేదని వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ కార్యదర్శి పొన్నవోలు సుధాకర్‌రెడ్డి మండిపడ్డారు. టీడీపీ నాయకుల దాడిలో గాయపడి గుంటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మన్నవ గ్రామ సర్పంచ్, వైఎస్సార్‌సీపీ నేత బొనిగల నాగ మల్లేశ్వరరావును శనివారం సుధాకర్‌రెడ్డి, నియోజకవర్గాల సమన్వయకర్తలు అంబటి మురళీకృష్ణ , వనమా బాల వజ్రబాబులు పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి నాగ మల్లేశ్వరరావు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఎంతమందిని పొట్టనపెట్టుకుంటారు?
పొన్నవోలు మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రంలో ప్రతి రోజు ఏదో ఒకచోట జరిగే ఈ రక్త దాహానికి అంతులేకుండా పోతోందని అన్నారు. నాలుగేళ్లలో వైఎఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలను ఎంత మందిని పొట్టన పెట్టుకుంటారని మండిపడ్డారు. ఇప్పటి వరకు అనేక మందిని హతమార్చారని ఆరోపించారు. ఏ ఒక్కరి రక్తపు బొట్టు చిందినా వారికి వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని అన్నారు. వైఎస్ జగన్ ప్రతి ఒక్కరిని కన్న బిడ్డల్లా చూసుకున్నారని తెలిపారు. నలభై ఏళ్లుగా ప్రజా సేవ చేస్తున్న నాగ మల్లేశ్వరరావుపై దాడికి పాల్పడటం దారుణమని అన్నారు. ీసీసీ టీవీ ఫుటేజీ దృశ్యాలు వైరల్ అయి, ప్రజల్లోకి వెళ్లడంతోనే కేసు నమోదు చేశారని మండిపడ్డారు. ఈ కేసులో స్థానిక ఎమ్మెల్యేను కూడా ముద్దాయిగా చేర్చాలని డిమాండ్ చేశారు.
ఎమ్మెల్యేను కూడా నిందితుడిగా చేర్చాలి
పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ మాట్లాడుతూ నాగ మల్లేశ్వరరావు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారని అన్నారు.
స్థానిక ఎమ్మెల్యే ప్రోత్సాహ ంతోనే ఈ హత్యాకాండకు ప్రయత్నించారని ఆరోపించారు. ఇటీవల మినీ మహానాడులో జరిగిన వీడియో ఆధారంగా ఎమ్మెల్యేను కూడా నిందితుడిగా చేర్చాలని డిమాండ్ చేశారు. దీనిపై జిల్లా ఎస్పీని కలిసి వినతిపత్రం అందిస్తామని చెప్పారు.
నలభై ఏళ్లుగా ప్రజా సేవ చేస్తున్న నాగ మల్లేశ్వరరావుపై దాడి దారుణం వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ కార్యదర్శి పొన్నవోలు సుధాకర్‌రెడ్డి స్థానిక ఎమ్మెల్యేను కూడా ఈ కేసులో విచారించాలని డిమాండ్