
వైఎస్సార్‌సీపీలో నియామకాలు
పట్నంబజారు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఉమ్మడి గుంటూరు జిల్లాలో పలువురిని రాష్ట్ర సంయుక్త కార్యదర్శులుగా నియమిస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. ఈ మేరకు శనివారం కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి చెందిన వంగల వలి వీరారెడ్డి, బాపట్ల జిల్లా రేపల్లెకు చెందిన చిత్రాల ఓబేదు, పల్నాడు జిల్లా గురజాలకు చెందిన కొమ్మినేని వెంకటేశ్వరరావు, పెదకూరపాడుకు చెందిన కొండవీటి కోటేశ్వరరావు, సీహెచ్ వెంకటేశ్వరరెడ్డి, ఏ అంజిరెడ్డి, కొమ్మిరెడ్డి గురవారెడ్డిలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
● ప్రత్తిపాడు నియోజకవర్గానికి చెందిన పెద్దిరెడ్డి సామ్రాజ్యంను అంగన్‌వాడీ విభాగం రాష్ట్ర కార్యదర్శిగా, మంగళగిరి నియోజకవర్గానికి చెందిన ఈపూరి రమేష్ (ఆదాం)ను పార్టీ పంచాయతీరాజ్ విభాగం సంయుక్త కార్యదర్శిగా నియమించారు.
ఘనంగా జగన్నాథ
రథయాత్ర
మంగళగిరి టౌన్ : మంగళగిరి నగర పరిధిలో శనివారం జగన్నాథ రథయాత్ర ఘనంగా నిర్వహించారు. గౌడియా మఠం ఆధ్వర్యంలో నగర పరిధిలోని ఘాట్‌రోడ్ వద్ద నుంచి మెయిన్‌రోడ్ మీదుగా మిద్దె సెంటర్, గౌతమ బుద్ధ రోడ్‌లో ఇది కొనసాగింది. కేరళ డప్పు వాయిద్యాలు, కోలాటాల నడుమ హరేకృష్ణ.. హరేరామ.. రామరామ హరేహరే అంటూ భక్తులు ముందుకు సాగారు. ప్రతి కూడలిలో భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు.
ఎంపీడీఓలకు శిక్షణ
గుంటూరు ఎడ్యుకేషన్: క్షేత్రస్థాయిలో గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక రూపకల్పన ఎంతో కీలకమని జెడ్పీ సీఈఓ వి.జ్యోతిబసు పేర్కొన్నారు. శనివారం జిల్లా పంచాయతీ వనరుల కేంద్రం ఆధ్వర్యంలో జెడ్పీ సమావేశ మందిరంలో పంచాయతీ పురోగతి సూచిక 2.0 వెర్షన్ 2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలోని ఎంపీడీఓలకు ఒక్కరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. సీఈఓ జ్యోతిబసు మాట్లాడుతూ 2025–26 సంవత్సరానికి రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ (ఆర్జీఎస్‌ఏ) వార్షిక ప్రణాళిక రూపకల్పనపై అవగాహన కల్పించారు. జిల్లా పంచాయతీ అధికారి బీవీఎన్ సాయి కుమార్, రాష్ట్రస్థాయి శిక్షకుడు డి.రవీంద్రబాబు, డీపీఎం సీహెచ్ వెంకటేశ్వర్లు, జిల్లాస్థాయిలో వివిధ శాఖల అధికారులు పాల్గొని శిక్షణ కల్పించారు.
ఎయిమ్స్ కార్డియాలజీ విభాగంలో అత్యాధునిక సేవలు
మంగళగిరి: మంగళగిరి తాడేపల్లి నగర పాలక సంస్థ పరిధిలోని ఎయిమ్స్ కార్డియాలజీ విభాగంలో అత్యాధునిక సేవలు అందుబాటులోకి వచ్చాయి. సెవెన్త్ జనరేషషన్ బై ప్లేస్ క్యాథ్ ల్యాబ్‌ను శనివారం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సీఈవో అహంతెమ్ శాంత సింగ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఈవో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌తోపాటు ఇతర రాష్ట్రాల ప్రజలకు గుండెకు సంబంధించి అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. సుమారు రూ. 11 కోట్లు ఖరీదు చేసే అధునాతన వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చామని పేర్కొన్నారు. అనంతరం ఎయిమ్స్ ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన బ్యాడ్మింటన్ కోర్టును ప్రారంభించారు. కార్డియాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కడియాల వికాస్, ఎయిమ్స్ అధికార ప్రతినిధి డాక్టర్ వంశీకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

వైఎస్సార్‌సీపీలో నియామకాలు

వైఎస్సార్‌సీపీలో నియామకాలు

వైఎస్సార్‌సీపీలో నియామకాలు