
హక్కుల కోసం పోరాటానికి సిద్ధంకండి
నెహ్రూనగర్: హక్కుల కోసం ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లందరూ ఏకమై పోరాడేందుకు రాష్ట్రస్థాయిలో బహిరంగ సభను విజయవంతం చేయాలని మాజీ డీజీపీ, ఆలిండియా బహుజన సమాజ్ పార్టీ (ఏఐబీఎస్పీ) రాష్ట్ర సమన్వయకర్త డాక్టర్ జె. పూర్ణచంద్రరావు అన్నారు. ఆదివారం గుంటూరులోని శ్రీనగర్‌లో మండల్ స్టడీ సర్కిల్‌లో ఆగస్టు నెలలో నిర్వహించే భారీ రాష్ట్ర మహాసభ ఏర్పాట్లపై చర్చించేందుకు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. ఉద్యోగులు ఎంతో కొంత సమాజానికి తిరిగివ్వాలని పేర్కొన్నారు. ఈడబ్ల్యూఎస్ పేరుతో రిజర్వేషన్లు కల్పించడంపై నిలదీసి అడగాలన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు రాజ్యాధికారం రావాలన్నదే ఏకై క లక్ష్యమని పేర్కొన్నారు. ఆ దిశగా పోరాటానికి సన్న ద్ధం కావాలన్నారు. తమిళనాడు తరహాలో ఇక్కడా బ్లాక్ షర్ట్ ఉద్యమం మొదలవ్వాలని పేర్కొన్నారు. జనాభాలో అత్యధిక వాటా ఉన్నా బీసీలకు రాజ్యాధికారం తదితర విషయాల్లో న్యాయం జరగడం లేదన్నారు. వారికి రిజర్వేషన్లు కూడా అదే దామాషాలో ఉండాలన్నా రు. ఈ అంశాన్ని రాజ్యాంగంలోని తొమ్మిదో షె డ్యూలులో పెట్టాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీలకు జనాభా దామాషాలో రిజర్వేషన్లు ఉన్నా, అధికారం నామమాత్రంగానే ఉంటోందని చెప్పారు. నిజమైన అధికారం ఎప్పుడూ కొన్ని వర్గాల చేతు ల్లోనే ఉంటోందని పేర్కొన్నారు. సమస్యలు పరిష్కారం కావాలంటే రాజ్యాధికారం రావాలన్నారు. అందుకోసం పార్టీలకు అతీతంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలంతా ఏకం కావాలని కోరారు.
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు
రాజ్యాధికారమే లక్ష్యం
మాజీ డీజీపీ, ఏఐబీఎస్పీ
రాష్ట్ర సమన్వయకర్త జె.పూర్ణచంద్రరావు