
ఇవిగో.. హత్యారాజకీయాలకు సాక్ష్యాలు
వైఎస్సార్ సీపీకి బలం ఉన్న చోట దాడులు చేయిస్తున్నారని, పార్టీ నేతలు, కార్యకర్తలను భయపెడుతున్నారని మురళీకృష్ణ మండిపడ్డారు. చింతలపూడి గ్రామంలో సొసైటీ సెక్రటరీ కూచిపూడి గాంధీ ఆత్మహత్య చేసుకున్నప్పుడు తన మరణ వాంగ్మూలంలో ధూళిపాళ్ల పేరు రాయలేదా... యలవర్తి నాగేశ్వరరావును హత్య చేయించింది మీరు కాదా అని ప్రశ్నించారు. వెల్లలూరును ఫ్యాక్షన్ గ్రామంగా మార్చింది ధూళిపాళ్లేనన్నారు. అనేక మందిపై దాడులు చేయించిన చరిత్ర ఉందన్నారు. మినీ మహానాడు సాక్షిగా వైఎస్సార్ సీపీ నేతలను భూస్థాపితం చేయాలని, లేని పక్షంలో తానే రంగంలోకి దిగుతానని మండల టీడీపీ అధ్యక్షుడు బాబూరావును ఉద్దేశించి ధూళిపాళ్ల చేసిన వ్యాఖ్యలు అందరికీ తెలిసినవే అన్నారు.