
మోసాన్ని వివరించాలి
కూటమి ప్రభుత్వం చేతిలో మరోసారి మోసపోయామని ప్రజలు ఒక అభిప్రాయానికి వచ్చారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉన్న సమయంలో సంవత్సరంలోపే ఇచ్చిన హామీలన్నీ 90 శాతం అమలు చేశారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి కన్నా ఎక్కువ సంక్షేమ పథకాలను అమలు చేస్తానని చెప్పి మోసం చేసింది. అమలు చేసిన పథకాల్లో సైతం కోత విధించింది. అనర్హులుగా తేల్చి పలువురి పెన్షన్లు, తల్లికి వందనం తీసివేశారు. సూపర్‌సిక్స్‌ను అమలు చేస్తారా లేదా అన్నది కూడా నమ్మకం లేదు. వైఎస్సార్ సీపీలో జరిగిన మంచిని, కూటమి ప్రభుత్వంలో జరిగిన అన్యాయాన్ని ప్రజలకు వివరించడమే మన లక్ష్యం.
–మురుగుడు హనుమంతరావు,
శాసనమండలి సభ్యులు