
చిల్డ్రన్స్ హోం సందర్శన
గుంటూరు లీగల్: క్యాలెండరు యాక్టివిటీస్‌లో భాగంగా జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అమరావతి ఆదేశాల మేరకు గుంటూరు బాలిక సదన్‌లోని చిల్డ్రన్స్ హోంను సోమవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియావుద్దీన్ సందర్శించారు. సదుపాయాల గురించి పిల్లల్ని అడిగి తెలుసుకున్నారు. హోంలో ఆహారం, విద్య, వైద్యంతో పాటు రూములను తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. న్యాయ సహాయం కోసం జిల్లా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించాలని తెలిపారు. ఆయన వెంట బాలిక సదన్ సూపరింటెండెంట్ కవిత, సిబ్బంది ఉన్నారు.