అగ్నికి ఆజ్యం పోసిన అరెస్టు | Sakshi Guest Column On Imran Khan Arrest At Pakistan | Sakshi
Sakshi News home page

అగ్నికి ఆజ్యం పోసిన అరెస్టు

Published Fri, Aug 11 2023 12:05 AM | Last Updated on Fri, Aug 11 2023 12:05 AM

Sakshi Guest Column On Imran Khan Arrest At Pakistan

రావల్పిండిలోని సైనిక ప్రధాన కార్యాలయ కనుసన్నల్లో ఇస్లామాబాద్‌ ప్రభుత్వం మెలగాల్సి రావడం పాకిస్తాన్‌ రాజకీయాలకు సంబంధించిన ఒక క్రూరమైన వ్యంగ్యాన్ని సూచిస్తుంది. ప్రధాని పదవికి ఇమ్రాన్‌ ఖాన్‌ చేరువకావడం, ఆ తర్వాత ఆయన అవమానకరమైన పతనం రెండూ సైనిక నాయ కత్వపు స్థిరత్వానికి చక్కటి ఉదాహరణ. పాకిస్తాన్‌ రాజకీయ, ఆర్థిక, భద్రతకు సంబంధించిన అనేక సవాళ్లను ఇమ్రాన్‌ అరెస్టు ఉదంతం మరింతగా పెంచుతుంది. యూఎస్‌ డాలర్‌తో పోలిస్తే పాకిస్తాన్‌ రూపాయి 282 రూపాయల కంటే తక్కువగా ఉండటంతో ఆర్థిక అవకాశాలు వట్టిపోతున్నాయి. దాతల సహాయాన్ని కోరుతున్నప్పుడు తరచుగా తిరస్కారానికి గురయినట్లు పాక్‌ తాజా మాజీ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ కూడా అంగీకరించారు.

పాకిస్తాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ను అక్రమాస్తుల కేసులో దోషిగా తేలిన తర్వాత ఆగస్టు 5న అరెస్టు చేశారు. చట్టం నిర్దేశించినట్లుగా ‘విచారణ ప్రక్రియ’ మార్గంలో వెళ్ళడానికి ఎలాంటి ప్రయత్నం చేయకుండానే, ప్రభుత్వ వ్యవస్థ ప్రధాన అంగం మాజీ ప్రధానమంత్రిపై దాడి చేసింది. ఇమ్రాన్‌ ఖాన్‌కు మునుపటి పాలకుల్లో కొందరు ఇటీవలి దశాబ్దాలలో అను భవించిన సుపరిచితమైన శిక్షా క్రమంలో ఇదీ భాగమే. రాజకీయ నేతగా మారిన ఈ ప్రజాకర్షక క్రికెటర్‌ను 2023 మే 9న అరెస్టు చేశారు. పాకిస్తాన్‌ సుప్రీంకోర్టు ఈ అరెస్టును ‘చట్టవిరుద్ధం’గా ప్రకటించి, ఆయన్ని విడుదల చేయగా, అది హింసాత్మక నిరసనలకు దారి తీసింది. ఫలితంగా 10 మంది మరణించారు. ప్రజా ఆస్తులకు గణనీ యమైన నష్టం వాటిల్లింది.

ఈసారి ఇమ్రాన్‌ అరెస్టుకు వీధుల్లో ప్రజల ప్రత్యక్ష మద్దతు ఇంకా లభించలేదు. ఇమ్రాన్‌ సొంత పార్టీ అయిన పాకిస్తాన్‌ తహరీక్‌–ఎ– ఇన్సాఫ్‌ (పీటీఐ), ఆయన్ని పంజాబ్‌ రాష్ట్రంలోని అటక్‌ జైలు నుండి రావల్పిండిలోని అత్యంత భద్రత కలిగి వున్న అదియాలా జైలుకు మార్చాలని ఇస్లామాబాద్‌ హైకోర్టులో పిటిషన్‌ వేసింది. ఇమ్రాన్‌కు మునుపు దేశాన్ని పాలించిన మాజీ ప్రధానులు షాహిద్‌ ఖాకన్‌ అబ్బాసీ, నవాజ్‌ షరీఫ్, బేనజీర్‌ భుట్టో కూడా అదే విధంగా క్రూర బెదిరింపులకు గురయ్యారు. విచారణను ఎదుర్కుంటూ, 1979లో ఉరిశిక్షకు గురైన జుల్ఫికర్‌ అలీ భుట్టోకు పట్టిన గతి తెలిసిందే.

రాజకీయ అదృష్టం ముఖం చాటేసినప్పుడు, పాకిస్తాన్‌ రాజ్యవ్యవస్థ తన సొంత అగ్రనేతలకు విధించే తీవ్రమైన శిక్ష ఎలాంటిదో భుట్టో ఉదంతం గుర్తుచేస్తుంది. ఇమ్రాన్‌ పొందిన ఈ పతనం, పాకిస్తాన్‌ సైన్యం ఆయన పట్ల అభిమానం కోల్పోయిందని సూచిస్తుంది. ప్రత్య క్షంగా లేదా పరోక్షంగా పాక్‌ సైన్యం చేతుల్లో పగ్గాలు ఉంటాయి. సైనిక ప్రయోజనాలకు అనుగుణంగా రాజకీయ నాయకత్వం మసలుకోన ప్పుడు లేదా మరీ ఎక్కువగా స్వతంత్రత ప్రదర్శించినప్పుడు పాక్‌ సైన్యం రాజకీయ నాయకత్వాన్ని అధికారం నుండి దింపేస్తుంది.

రావల్పిండిలోని సైనిక ప్రధాన కార్యాలయ కనుసన్నల్లో ఇస్లామాబాద్‌ ప్రభుత్వం మెలగాల్సి రావడం పాక్‌ రాజకీయాలకు సంబంధించిన ఒక క్రూరమైన వ్యంగ్యాన్ని సూచిస్తుంది. శాసన సభ్యులు ఎంత ప్రజాస్వామ్యాన్ని ఉపయోగించవచ్చో నిర్ణయించేది సైన్యమే. స్పష్టంగా, సైన్యం మద్దతిచ్చి మరీ ప్రధానమంత్రి కుర్చీలో కూర్చో బెట్టిన ఇమ్రాన్‌ ఆ సైన్యం చేతినే కొరకడంతో పాక్‌ సైనిక నాయకత్వం చాలా అసౌకర్యాన్ని అనుభవించింది. పాకిస్తాన్‌లో అత్యు న్నత కార్యా లయానికి (ఆగస్టు 2018) ఇమ్రాన్‌ ఒక్కసారిగా చేరువ కావడం, ఆ తర్వాత ఆయన అవమానకరమైన పతనం రెండూ సైనిక నాయ కత్వపు స్థిరత్వానికి చక్కటి ఉదాహరణగా చెప్పవచ్చు.

1996లో ఇమ్రాన్‌ స్థాపించిన పాకిస్తాన్‌ తహరీక్‌–ఎ–ఇన్సాఫ్‌ (పీటీఐ) ఒకప్పుడు దేశ రాజకీయాల్లో పరాయి పార్టీగా ఉండేది. దశాబ్ద కాలంలోనే, పాక్‌లో బలంగా ఉన్న పార్టీలకు ఇది గట్టి ప్రత్యర్థిగా నిలిచింది. నైతికంగా తన ఉన్నత స్థానాన్ని ప్రకటిస్తూ, పాత నాయకులు అవినీతికి పాల్పడ్డారని ఆరోపించింది. ఎన్నికైతే స్వచ్ఛ మైన ప్రభుత్వాన్ని అందిస్తానని వాగ్దానం చేసింది.

2013 జూన్‌లో మూడవసారి ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నవాజ్‌ షరీఫ్‌ ఎప్పుడూ పూర్తి కాలంపాటు దేశాన్ని పాలించ లేకపోయారు. ప్రభుత్వం లోపలి ప్రభుత్వం, అంటే సైనిక వ్యవస్థ ప్రయోజనాలకు ఎంతో కాలం సేవచేయడని రావల్పిండిలోని సైనిక హెడ్‌ క్వార్టర్స్‌ నిర్ణయించుకున్న ప్రతిసారీ షరీఫ్‌ తన ప్రధాని పదవి కోల్పోయారు. ఇమ్రాన్‌ పార్టీ ఆయన్ని లక్ష్యంగా చేసుకున్న తర్వాత 2017 జూలైలో షరీఫ్‌ చివరిసారిగా బలవంతంగా అధికారం నుంచి నిష్క్రమించారు.

వివిధ నేరాలకు పాల్పడ్డారని అభియోగాలు మోప బడి, అవమానకరమైన రీతిలో దేశం విడిచి వెళ్లడానికి ముందు నవాజ్‌ షరీఫ్‌ జైలు పాలయ్యారు. అనంతరం ఆయన సోదరుడు షెహబాజ్‌ షరీఫ్‌ ప్రధాని అయ్యారు. పెద్ద షరీఫ్‌ త్వరలో దేశానికి తిరిగి వస్తారనీ, ఎన్నికలు ఎప్పుడు జరిగినా తమ పార్టీ పీఎమ్‌ఎల్‌(ఎన్‌)ను అధికారంలోకి తేవడానికి నాయకత్వం వహిస్తారనీ షెహబాజ్‌కు తెలుసు.

పాకిస్తాన్‌ రాజకీయ, ఆర్థిక, భద్రతకు సంబంధించిన అనేక సవాళ్లను ఇమ్రాన్‌ అరెస్టు ఉదంతం మరింతగా పెంచుతుంది. ప్రస్తుత జాతీయ అసెంబ్లీ తన ఐదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకొని, ఆపద్ధర్మ ప్రభుత్వానికి పగ్గాలు అప్పగించడానికి మూడు రోజుల ముందు, ఆగస్టు 9న జాతీయ అసెంబ్లీ రద్దవుతుందని షెహబాజ్‌ షరీఫ్‌ గత వారం ప్రకటించారు (అనుకున్నట్టుగానే ఆగస్టు 9న రద్దయింది).

ఎన్నికల్లో పోటీ చేయకుండా నిరోధించేందుకే ప్రజాదరణ ఉన్న ఇమ్రాన్‌ అరెస్టును ప్లాన్‌ చేశారనీ, ఈ అంశంపై షరీఫ్, భుట్టో–జర్దారీ నేతృత్వంలోని రెండు ప్రధాన రాజకీయ పార్టీలు రావల్పిండి సైనిక నాయకత్వంతో కుమ్మక్కయ్యాయనీ విమర్శకులు అంటున్నారు.

రాజకీయ దుమారాన్ని మరింతగా పెంచడానికి, షెహబాజ్‌ షరీఫ్‌ ప్రభుత్వం మొట్టమొదటిసారిగా డిజిటల్‌గా ప్రారంభించిన జాతీయ జనాభా గణన ఫలితాన్ని ఆమోదించింది. తద్వారా అక్టోబర్, నవంబర్‌లో జరగాల్సిన ఎన్నికలను వాయిదా వేయవచ్చనే ఊహాగా నాలకు తెరలేచింది. 

పాకిస్తాన్‌ ప్రస్తుత ఆర్థిక ద్రవ్య స్థితి శుష్కించి ఉంది. దాతల సహాయాన్ని కోరుతున్నప్పుడు తరచుగా తిరస్కారానికి గురవు తున్నట్లు షెహబాజ్‌ షరీఫ్‌ అంగీకరించారు. ‘ఈరోజు మనం తలెత్తు కుని జీవించాలా లేక భిక్షాటన చేస్తూ బతకాలా అనేది నిర్ణయించు కోవాలి’ అని ఆయన అన్నారు. ‘భారతదేశం ముందుకు సాగింది, కానీ మన సొంత తప్పిదాల వల్ల మనం వెనుకబడిపోయాము’ అని కూడా అంగీకరించారు. దాయాది దేశం పట్ల ఇది అరుదైన దాపరికం లేని మాట అనే చెప్పాలి. 

పాకిస్తాన్‌ లోపాలు దాని డీఎన్‌ఏలో నిక్షిప్తమై ఉన్నాయి. వలస పాలన అనంతర ఎన్నో దేశాలు సమర్థవంతమైన పౌర పాలనకు పరివర్తన చెందడానికి అనుసరించిన సూత్రప్రాయ రాజకీయ ప్రక్రి యలను అణచివేయడంలో ఉన్నాయి. విచారకరంగా, పాక్‌ సైన్యం, కశ్మీర్‌ను తన శాశ్వత బోగీగా ఉపయోగించుకుని, రాజ్యాధికారం, ఆర్థిక ప్రాధాన్యతలకు చెందిన చాలా ముఖ్యమైన మీటలను ఏకీకృతం చేసుకుంది. అటువంటి ఆధిపత్య ప్రదర్శనకు సైన్యాన్ని అనుమతించడం వల్ల ప్రభుత్వంపై పడే ఖర్చు గురించి పాకిస్తాన్‌ పౌర సమాజంలోని కొన్ని వర్గాలు జాతిని హెచ్చరించాయి కానీ అవి ఫలించలేదు.

ఈ ప్రాణాంతకమైన వ్రణం జనరల్‌ జియా–ఉల్‌–హక్‌ పాలనలో సమ్మిళితం అయింది. ఇది ప్రభుత్వం, సమాజం స్థిరంగా ఇస్లామీకర ణకు గురవడానికి నాంది పలికింది. ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో ప్రాంతీయ భౌగోళిక రాజకీయ పరిణామాలు (1979లో అఫ్గానిస్తా న్‌పై సోవియట్‌ దండయాత్ర వంటివి) అంతర్జాతీయ పర్యవసానా లకు దారి తీశాయి. ఈ కారణాలన్నీ పాక్‌కు భద్రతా సవాలును మరింత తీవ్రతరం చేశాయి. ఖైబర్‌–పఖ్తూన్‌ఖ్వా రాష్ట్రంలోని బాజౌర్‌ జిల్లాలో ఇటీవల జరిగిన ఉగ్రదాడి, 60 మందికిపైగా మరణానికి కార ణమైంది. ఈ చర్యకు కారణం తామేనని ఇస్లామిక్‌ స్టేట్‌ (ఖురా సాన్‌) ప్రకటించింది. అంతర్గత భద్రతా పరిస్థితికి ఇది విషాద సాక్ష్యం.

యూఎస్‌ డాలర్‌తో పోలిస్తే పాకిస్తాన్‌ రూపాయి 282 రూపా యల కంటే తక్కువగా ఉండటంతో ఆర్థిక అవకాశాలు వట్టిపోతు న్నాయి. ఇమ్రాన్‌ అరెస్టు అనేది తాత్కాలిక ప్రభుత్వం పరిష్కరించాల్సిన సంక్లిష్టమైన అనేక పెను సవాళ్లకు చెందిన మురికి మంచు కొండ కొస మాత్రమే. ఎప్పటిలాగే రావల్పిండి సైనిక నాయకత్వం మోసపోయిన పాకిస్తానీ ప్రజల అదృష్టాన్ని నిర్ణయిస్తుంది.
సి. ఉదయ్‌ భాస్కర్‌ 
వ్యాసకర్త, సొసైటీ ఫర్‌ పాలసీ స్టడీస్‌ డైరెక్టర్‌
(‘ది ట్రిబ్యూన్‌’ సౌజన్యంతో)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement