మధుమేహం రాకుండా చేసుకోండి ఇలా..!

Tips To Avoid Diabetes - Sakshi

పడిశం పదిరోగాల పెట్టు అన్నట్లు ఒక్క మధుమేహం చాలు... రకరకాల జబ్బులున్నట్టే. ఎన్నో ఇబ్బందుల పాలు చేస్తుంది. కుటుంబ చరిత్రలో మధుమేహం ఉన్నవారు, ఊబకాయం ఉన్నవారు, వ్యాయామం చేయని వారు, త్వరగా మధుమేహం బారిన పడతారు.

మధుమేహం వచ్చాక బాధపడేకంటే రాకుండా చేసుకోవడం చాలా మేలు. అసలు మధుమేహం మన జీవన శైలిలో ఉన్న లోపాల వలన వస్తుంది. కాబట్టి జీవనశైలిని, మన ఆహారపుటలవాట్లను మార్చుకుంటే మధుమేహం రాకుండా చూసుకోవచ్చు. అలాంటి చిట్కాలు చూద్దాం. 

పిండి పదార్థం ఎక్కువగా ఉన్న బియ్యం, గోధుమ లకు బదులు సిరిధాన్యాలు లేదా చిరుధాన్యాలు తీసుకుంటే చాలావరకు మధుమేహం తగ్గుతుంది.
పంచదారకు బదులు బెల్లం లేదా తేనె తగు మోతాదులో వాడుకోవాలి. పంచదార పూర్తిగా నిషేధమే.
ఉప్పును కూడా చాలా తక్కువ గా వాడుకోవాలి.
పచ్చి కూరలైన కీరా, కారట్, బీట్రూట్, సొర, గుమ్మడి వంటి వాటిని తురిమి పెరుగులో వేసుకుని తింటే మధుమేహం చాలా వరకు నియంత్రణలో ఉంటుంది.
రోజూ 30–60 నిమిషాలు ప్రాణాయామం, ధ్యానం, నడక వంటివి చేయాలి.
ఆహారంలో సరైన కార్బోహైడ్రేట్లు (పొట్టు తో కూడిన ఆహారం – తక్కువ పోలిష్‌ పట్టిన బియ్యం, ఓట్స్, పొట్టు తీయని పప్పులు, పచ్చి కూరగాయలు, ఎక్కువ తీపిలేని పండ్లు తీసుకుంటూ, వ్యాయామం చేస్తే మధుమేహం అదుపులో ఉంటుంది.

చదవండి: Urinary Incontinence: దగ్గినప్పుడల్లా మూత్రం పడుతోంది! ట్రీట్‌మెంట్‌ ఉందా?

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top